- Home
- Entertainment
- చేసిన ఒక్క సినిమా కూడా అట్టర్ ఫ్లాప్, కానీ 74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా
చేసిన ఒక్క సినిమా కూడా అట్టర్ ఫ్లాప్, కానీ 74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా
ఓ క్రేజీ హీరోయిన్ తెలుగులో నటించిన ఒకే ఒక్క చిత్రం డిజాస్టర్ అయింది. కానీ ఆమె ఆస్తులు వివరాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి.

అనన్య పాండే జీవనశైలి
అనన్య పాండే ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె తండ్రి చుంకీ పాండే బాలీవుడ్ లో ప్రముఖ్ నటుడు. అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆమెకి ఎక్కువగా సక్సెస్ ఫుల్ చిత్రాలు లేవు.కానీ ఆమెకి ఆస్తులు మాత్రం స్టార్ నటీమణుల రేంజ్ లో ఉన్నాయి. ముంబైలో సొంత అపార్ట్‌మెంట్ కొనడం అనన్య కెరీర్‌లో పెద్ద మైలురాయి. గౌరీ ఖాన్ డిజైన్ చేసిన ఈ ఇల్లు ఆమె అభిరుచికి అద్దం పడుతుంది. 26 ఏళ్లకే సొంతిల్లు ఆమె విజయాన్ని చూపిస్తుంది.
అనన్య పాండే కార్ల కలెక్షన్
అనన్యకు లగ్జరీ కార్లంటే ఇష్టం. ఆమె కార్ కలెక్షన్‌లో రూ.1.70 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఉంది. ఈ కారు ఆమె వేగవంతమైన జీవనశైలికి సరిగ్గా సరిపోతుంది. ముంబై వీధుల్లో డ్రైవింగ్ ఆమెకు లగ్జరీ అనుభవం.స్టైలిష్ డ్రైవ్‌ల కోసం అనన్య తరచుగా తన రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఎంచుకుంటుంది. దీని విలువ రూ.1.64 కోట్ల నుండి రూ.1.84 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కారు ఆమె ప్రయాణాలను సౌకర్యవంతంగా, గ్లామరస్‌గా మారుస్తుంది.
ఆ ఒక్క చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్
అనన్య పాండే బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటోంది. కానీ తెలుగులో ఆమెకి అంతగా కలసి రాలేదు. తెలుగులో ఆమె నటించింది కేవలం ఒక్క చిత్రం మాత్రమే. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అనన్య నటించిన లైగర్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.
బాంద్రాలో రూ.10 కోట్ల ఫ్యామిలీ హోమ్
సొంత ఇంటికి మారకముందు, అనన్య తన తల్లిదండ్రులతో కలిసి బాంద్రాలోని పాలి హిల్‌లో నివసించింది. రూ.10 కోట్ల విలువైన ఈ ఇంట్లో ఆమె బెడ్‌రూమ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఇంటి ఫోటోలు కనిపిస్తాయి.
ఫ్యాషన్ ఐకాన్
అనన్య పాండే గ్లామర్ విషయంలో బాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తగదు. వివిధ రకాల ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ తో అనన్య గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఇలా గ్లామర్ తో ఆమె యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది.
నికర విలువ - రూ.74 కోట్లు
అప్పుడప్పుడూ వస్తున్న సినిమా అవకాశాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో అనన్య బాగానే సంపాదిస్తోంది. దీనితో ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.74 కోట్లుగా ఉంది. ఆమె నెల సంపాదన రూ.60 లక్షలు, వార్షిక ఆదాయం రూ.7 కోట్లకు పైగా ఉంది.