- Home
- Entertainment
- స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో 'వకీల్ సాబ్' నటి ప్రేమ వివాహం ? షాకింగ్ రూమర్స్ పై యంగ్ బ్యూటీ సమాధానం..
స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో 'వకీల్ సాబ్' నటి ప్రేమ వివాహం ? షాకింగ్ రూమర్స్ పై యంగ్ బ్యూటీ సమాధానం..
టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

Ananya Nagalla
టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ తో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది.
మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది.
హీరోయిన్ అన్నాక రూమర్స్ పుట్టుకొచ్చేస్తాయి. అనన్య నాగళ్ళ కూడా అందుకు అతీతం కాదు. సెలెబ్రిటీల గురించి వైరల్ అయ్యే రూమర్స్ కొన్ని నిజం అవుతుంటే మరికొన్ని గాలి వార్తలు గానే మిగిలిపోతున్నాయి. అనన్య నాగళ్ళ గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనన్య నాగళ్ళ త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనన్య నాగళ్ళ టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ చిన్న కుమారుడితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్ళ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో పెళ్లి గురించి చర్చ జరిగిందట.
కొన్ని నిబంధనలతో పెళ్ళికి కూడా అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరిగింది. దీనితో అనన్య నాగళ్ళ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై అనన్య నాగళ్ళ సెటైరికల్ గా స్పందిస్తూ అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేల్చేసింది.
'నా కోసం వరుడుని చూసిపెట్టినందుకు