- Home
- Entertainment
- Bigg Boss Telugu Season 8: హౌస్లోకి అమర్ దీప్ ఫ్రెండ్, రగిలిపోతున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్!
Bigg Boss Telugu Season 8: హౌస్లోకి అమర్ దీప్ ఫ్రెండ్, రగిలిపోతున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్!
గత సీజన్ లో అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోరు నడిచింది. చివరికి పల్లవి ప్రశాంత్ పై చేయి సాధించాడు. ఈసారి అమర్ దీప్ ఫ్రెండ్ హౌస్లోకి వెళుతున్నాడట. అదే నిజమైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతడి కోసం కాచుకుని ఉన్నారు...

బిగ్ బాస్ తెలుగు 8కి నగారా మోగింది. మరో నెల రోజుల్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. సీజన్ 8 లోగో అదిరింది. హోస్ట్ నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగో విడుదల చేశారు. లోగోనే ఓ ఫజిల్ అంటున్నారు. లేటెస్ట్ సీజన్ ఎలా డిజైన్ చేశారో లోగోలో పొందుపరిచారని బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు.
Bigg boss telugu 8
ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలెబ్స్ పేరు తెరపైకి వచ్చాయి. బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్, అమృత ప్రణయ్, యాదమ్మ రాజు, మై విలేజ్ షో అనిల్, రీతూ చౌదరి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. తాజాగా మరో సెలబ్రిటీ పేరు వినిపిస్తోంది.
Pallavi Prashanth
బిగ్ బాస్ తెలుగు 7 రన్నర్ అమర్ దీప్ చౌదరి క్లోజ్ ఫ్రెండ్ నరేష్ లొల్ల సీజన్ 8కి ఎంపికయ్యాడట. నరేష్ లొల్ల సీరియల్ నటుడు. అమర్ దీప్ హీరోగా చేసిన జానకి కలగనలేదు సీరియల్ లో ఓ పాత్ర చేశాడు. ఇతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు.
Bigg Boss Telugu
అమర్ దీప్ కోసం గట్టిగా ప్రచారం చేశాడు నరేష్ లొల్ల. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య హౌస్లో సమరం నడిచింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కుటుంబ సభ్యులను దూషించారు. అమర్ దీప్ ని సపోర్ట్ చేసిన వాళ్ళను సైతం ట్రోల్ చేశాడు. దానితో నరేష్ లొల్ల పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూ వరుస వీడియోలు చేశాడు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ మీద ఆరోపణలు చేశాడు.
Naresh Lolla
బిగ్ బాస్ షో ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చిన అమర్ దీప్ కారుపై దాడి జరిగింది. ఆ కారులో నరేష్ లొల్ల కూడా ఉన్నాడు. ఘటన అనంతరం నరేష్ సీరియస్ వీడియో చేశాడు. నా కొడకల్లారా ఎవరినీ వదలను అంటూ... పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కడి మీద కేసు పెడతాను. నేను సాక్ష్యం చెబుతాను అంటూ ఫైర్ అయ్యాడు.
Naresh Lolla
అమర్ దీప్ మిత్రుడిగా, పల్లవి ప్రశాంత్ వ్యతిరేకిగా నరేష్ లొల్ల కు మంచి ప్రచారం దక్కింది. మరి బిగ్ బాస్ సీజన్ 8లో నరేష్ లొల్ల కంటెస్ట్ చేస్తే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నుండి అతడు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు నరేష్ లొల్ల ను ట్రోల్ చేస్తారు అనడంలో సందేహం లేదు. మరోసారి నరేష్ లొల్ల కారణంగా బిగ్ బాస్ హౌస్లో రణరంగం జరగనుందన్న వాదన వినిపిస్తోంది..