అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడా.. అందరి ముందు లీక్ చేసేసింది
అమర్ దీప్ చౌదరి, తేజస్విని దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని శ్రీముఖి లీక్ చేసింది. బిగ్ బాస్ తర్వాత అమర్ దీప్ కి బయట సూపర్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.
అమర్ దీప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి సగం రోజులు సైలెంట్ గా ఉన్న అమర్.. ఆ తర్వాత పెద్ద హంగామానే చేశాడు. ఆ హంగామా వల్ల విమర్శలు వచ్చినప్పటికీ అతడికి పబ్లిసిటీ బాగా పెరిగింది. ఫలితంగా శివాజీని వెనక్కి నెట్టి రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hp62g4s4srty3xzsrb4ehkwq/screenshot-2024-02-09-095827-png_300x154xt.jpg)
బుల్లితెరపై నటుడిగా ప్రూవ్ చేసుకున్న అమర్ బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో వెండి తెరపై కూడా వెలగాలని ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా అమర్ దీప్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో సురేఖ వాణి కుమార్తె సుప్రీతా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా అమర్ దీప్, అతడి సతీమణి తేజస్విని త్వరలో వాలంటైన్స్ డే సందర్భంగా ఒక షోకి హాజరయ్యారు. ఈ షోని శ్రీముఖి హోస్ట్ చేస్తోంది. వీరితో పాటు బుల్లితెర జంటలు సిద్దు, విష్ణుప్రియ.. అలాగే డాక్టర్ బాబు నిరుపమ్ తన సతీమణితో హాజరయ్యారు.
ఈ జంటలతో శ్రీముఖి బాగా రొమాన్స్ చేయించింది. వాలంటైన్స్ డే రోజున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండడంతో రొమాన్స్ పై ఎక్కువ ఫోకస్ చేశారు. ఇద్దరు కలిసి చాక్లెట్ తినడం.. డ్యాన్స్ చేయడం లాంటివి చేశారు. అమర్ దీప్, సిద్ధూ, నిరుపమ్ తమ భార్యలకు జడలు వేయడం.. ఎత్తుకోవడం లాంటి చిలిపి పనులు చేశారు.
ముక్కు అవినాష్ వేసే జోకులు అయితే కడుపు ఉబ్బా నవ్వించాయి. ఇక శ్రీముఖి ఒక్కో జంట గురించి చెబుతూ జోకులు వేసింది. అమర్ దీప్, తేజస్విని గురించి మాట్లాడుతూ.. త్వరలో బేబీ రాబోతోంది.. తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ అందరి ముందు లీక్ చేసింది.
అయితే ఇంతవరకు అమర్ దీప్, తేజస్విని అఫీషియల్ గా ఈ గుడ్ న్యూస్ ని రివీల్ చేయలేదు. శ్రీముఖి క్యాజువల్ గా ఆ మాట అనిందా లేక నిజంగానే తేజస్విని గౌడ గర్భవతా అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత మీడియాలో బాగా హైలైట్ అయింది అంటే శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి అనే చెప్పాలి.