- Home
- Entertainment
- Amala Paul: తాను హ్యాపీగా లేకపోవడానికి కారణం బయటపెట్టిన అమలా పాల్.. వైట్ శారీలో పిచ్చెక్కించే లుక్
Amala Paul: తాను హ్యాపీగా లేకపోవడానికి కారణం బయటపెట్టిన అమలా పాల్.. వైట్ శారీలో పిచ్చెక్కించే లుక్
డస్కీ బ్యూటీ అమలా పాల్.. స్వేచ్చగా విహరిస్తుంది. తనకు నచ్చినట్టు లైఫ్‌ని లీడ్ చేస్తుంది. వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. గ్లామర్ షోతో సోషల్ మీడియాలో క్రేజ్‌ని పెంచుకుంటుంది. నచ్చిన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

కేరళా కుట్టి అమలా పాల్.. ఓనం పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వైట్ శారీలో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తుంది డస్కీ బ్యూటీ. చీరలో ఆమె అందం మరింత పెరిగిపోయింది. స్కిన్ షో చేయడం కంటే ఇలా నిండుగా కనిపించడంలోనే అమలా పాల్ అందం ఓవర్‌లోడ్ కావడం విశేషం. కేరళా ప్రజల ప్రత్యేకమైన పండుగ ఓనం. మంగళవారం వారంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కేరళా అమ్మాయిలే కాదు, అక్కడి సాంప్రదాయాన్ని ఇష్టపడే చాలా మంది ఆడపడుచులు వైట్ శారీలో మెరిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక కేరళా కుట్టీలు దాన్ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమలా పాల్ కూడా అదే చేసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. అమలా పాల్ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓనం పండుగ విషెస్ చెబుతూ, చీరలో మైండ్ బ్లాక్ చేస్తున్నావంటూ, బ్యూటీఫుల్‌గా ఉన్నావంటున్నారు.
అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ రెండేళ్లలోనే విడిపోయారు. ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాలు, బేదాభిప్రాయలతో విడిపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి అమలా పాల్ ఒంటరిగానే ఉంటుంది. స్వేచ్ఛగా జీవిస్తుంది. నచ్చినట్టుగా లైఫ్‌ని లీడ్ చేస్తుంది. సినిమాల్లోనూ స్వేచ్ఛగా పాత్రలు చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిందట. ఆ విషయాన్నీ బయటపెట్టిందీ బ్యూటీ. కండలు తిరిగిన దేహం కలిగిన వ్యక్తి తనకు భర్తగా కావాలట, బెడ్ రూమ్‌లో అలాంటి వాడిని ఇష్టపడతా అని చెప్పింది. దీంతోపాటు తనని బాగా ప్రేమించేవాడు, దయతో జాలి హృదయం కలిగి ఉండాలని పేర్కొంది. ఎప్పుడూ ఫన్నీగా, సరదాగా ఉండాలని, అలాంటి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి సిద్ధమే అని చెప్పింది.
ఇదిలా ఉంటే అమలా పాల్ కి సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో తనకు బ్యాకెండ్ లేరని వాపోయింది. లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో తెలియజేసే వ్యక్తి తన జీవితంలో లేరని, అలాంటి వ్యక్తి ఉండి ఉంటే తాను చాలా సంతోషంగా ఉండేదాన్ని అని పేర్కొంది.
`మైనా` చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా హిట్ అందుకుంది. అదే తన ప్రాపర్ తమిళ్ ఎంట్రీగా చెబుతుంది. అయితే ఆ సినిమా టైమ్‌లో తాను చాలా మానసికంగా కుండిపోయిందట. మానసిక వేదనకు గురైనట్టు చెప్పింది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా టైమ్ లో రెండేళ్లపాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఎంతో వేదన అనుభవించినట్టు తెలిపింది అమలా పాల్.
ఆ సమయంలో తనకంటే తన తల్లి ఎక్కువగా బాధపడిందట. తనకు మార్గదర్శి ఎవరూ లేరని, దీనికి కారణంగా చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపింది. అలాంటి వ్యక్తి ఉంటే జీవితంలో చాలా ఆనందంగా ఉండేదాన్నేమో అని పేర్కొంది అమలా పాల్. ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Amala Paul
ఆ సమయంలో తనకంటే తన తల్లి ఎక్కువగా బాధపడిందట. తనకు మార్గదర్శి ఎవరూ లేరని, దీనికి కారణంగా చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపింది. అలాంటి వ్యక్తి ఉంటే జీవితంలో చాలా ఆనందంగా ఉండేదాన్నేమో అని పేర్కొంది అమలా పాల్. ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Amala Paul
ఇక అమలాపాల్ నటిగా ఇప్పుడు బిజీగా ఉంది. ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. `జెండా పై కపిరాజు` చిత్రం తర్వాత తెలుగులో మెరవలేదు ఈ బ్యూటీ. ఆ మధ్య `పిట్టకథలు` అనే ఓటీటీ ఫిల్మ్ లో కనిపించింది. తెలుగులో `బెజవాడ`, `నాయక్`, `ఇద్దరమ్మాయిలతో`, `జెండా పై కపిరాజు` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళంలో మూడు సినిమాలు, తమిళంలో ధనుష్‌తో ఓ చిత్రంలో నటిస్తుందీ డస్కీ బ్యూటీ.