MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అల్లు శిరీష్, నయనిక లవ్ స్టోరీకి కారణమైన ఇద్దరు క్రేజీ హీరోలు.. అంతా మొదలైంది ఆ రాత్రే

అల్లు శిరీష్, నయనిక లవ్ స్టోరీకి కారణమైన ఇద్దరు క్రేజీ హీరోలు.. అంతా మొదలైంది ఆ రాత్రే

అల్లు శిరీష్, నయనిక ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు శిరీష్ స్వయంగా తన ప్రేమ కథని బయట పెట్టారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 02 2025, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రేయసితో అల్లు శిరీష్ నిశ్చితార్థం
Image Credit : Asianet News

ప్రేయసితో అల్లు శిరీష్ నిశ్చితార్థం

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ తన ప్రేయసి నయనికతో గ్రాండ్ గా అక్టోబర్ 31న జరిగింది. అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖులు, హీరోలు ఈ వేడుకకి హాజరయ్యారు. అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తన లవ్ స్టోరీ రివీల్ చేసిన అల్లు శిరీష్
Image Credit : Allu sirish instagram

తన లవ్ స్టోరీ రివీల్ చేసిన అల్లు శిరీష్

అయితే అల్లు శిరీష్ గురించి అందరికీ తెలుసు. కానీ నయనిక గురించి అంతగా జనాలకు తెలియదు. ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. కానీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలయింది అనే ఆసక్తికర ప్రశ్న అభిమానుల్లో ఉంది. సస్పెన్స్ కి తెరదించుతూ అల్లు శిరీష్ నయనికతో తన ప్రేమ ఎలా మొదలైందో రివీల్ చేశాడు. 

Related Articles

Related image1
నన్ను బలిపశువుని చేశారు, భరణిని హౌస్ లో ఉంచడం కోసమే ఇంత డ్రామా..బిగ్ బాస్ షోలో కుట్రలు బయటపెట్టిన శ్రీజ
Related image2
ఆ సినిమా నుంచే స్టార్ పై క్రష్, వకీల్ సాబ్ నటి కామెంట్స్.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్
35
ఆ ఇద్దరు హీరోలే కారణం
Image Credit : Allu sirish instagram

ఆ ఇద్దరు హీరోలే కారణం

నాయనిక చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదు కానీ.. చిత్ర పరిశ్రమలో ఆమెకి స్నేహితులు ఉన్నారు. ఇద్దరు క్రేజీ హీరోల వల్ల తన లవ్ స్టోరీ ప్రారంభమైనట్లు శిరీష్ తెలిపారు. ఆ హీరోలు ఎవరో కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ హీరో నితిన్. రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత అల్లు శిరీష్, నయనిక లవ్ స్టోరీ మొదలైందట. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి చేసుకున్న తర్వాత నితిన్, షాలిని దంపతులు వారికి పార్టీ ఇచ్చారు. వరుణ్ తేజ్, నితిన్ మంచి స్నేహితులు. 

45
ఆ రాత్రే ఆమెతో పరిచయం ఏర్పడింది
Image Credit : Asianet News

ఆ రాత్రే ఆమెతో పరిచయం ఏర్పడింది

ఈ పార్టీకి వారి సన్నిహితులంతా హాజరయ్యారు. నితిన్ సతీమణి షాలిని కందుకూరికి నయనిక స్నేహితురాలు. దీనితో పార్టీకి ఆమెని కూడా ఇన్వైట్ చేశారు. ఆ పార్టీకి అల్లు శిరీష్ కూడా హాజరయ్యాడు. ఆ విధంగా అల్లు శిరీష్, నయనిక మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పార్టీ రోజు రాత్రే అంతా మొదలైంది అని శిరీష్ తెలిపారు. 

55
నా పిల్లలకు ఇదే చెబుతా
Image Credit : Asianet News

నా పిల్లలకు ఇదే చెబుతా

రెండేళ్ల తర్వాత ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాం అని శిరీష్ పేర్కొన్నాడు. మాకు పిల్లలు పుట్టాక.. మీ లవ్ స్టోరీ ఏంటి అని అడిగితే నేను ఇలా మొదలైంది అని చెబుతాను అంటూ శిరీష్ పోస్ట్ చేశారు. సో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీ గురించి ఎలాంటి రూమర్స్ కి తావు లేకుండా తానే చెప్పేశాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Related Stories
Recommended image1
నన్ను బలిపశువుని చేశారు, భరణిని హౌస్ లో ఉంచడం కోసమే ఇంత డ్రామా..బిగ్ బాస్ షోలో కుట్రలు బయటపెట్టిన శ్రీజ
Recommended image2
ఆ సినిమా నుంచే స్టార్ పై క్రష్, వకీల్ సాబ్ నటి కామెంట్స్.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved