- Home
- Entertainment
- నన్ను బలిపశువుని చేశారు, భరణిని హౌస్ లో ఉంచడం కోసమే ఇంత డ్రామా..బిగ్ బాస్ షోలో కుట్రలు బయటపెట్టిన శ్రీజ
నన్ను బలిపశువుని చేశారు, భరణిని హౌస్ లో ఉంచడం కోసమే ఇంత డ్రామా..బిగ్ బాస్ షోలో కుట్రలు బయటపెట్టిన శ్రీజ
దమ్ము శ్రీజ రీ ఎంట్రీలో సైతం ఎలిమినేట్ అయింది. భరణి కోసం బిగ్ బాస్ షోలో జరిగిన కుట్రని శ్రీజ బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోపై దుమ్మెత్తి పోస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

దమ్ము శ్రీజ రీఎంట్రీ, ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోని ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రారంభించారు. టైటిల్ కి తగ్గట్లుగా ఉండాలనుకున్నారో ఏమో కానీ బిగ్ బాస్ నిర్వాహకులు చిత్ర విత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఫైర్ స్టార్మ్ పేరుతో ఆరుగురు సభ్యులని వైల్డ్ కార్డు ఎంట్రీగా తీసుకువచ్చారు. ఇది చాలదన్నట్లు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజలని రీ ఎంట్రీ పేరుతో హౌస్ లోకి తీసుకువచ్చారు.
ప్రేక్షకుల విమర్శలు
అక్కడి నుంచి షోపై ప్రేక్షకుల్లో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. రీ ఎంట్రీ పేరుతో భరణి, శ్రీజ లని తీసుకువచ్చారు సరే.. వెంటనే శ్రీజని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏంటి.. ఆ సంబరానికి ఆమెని హౌస్ లోకి తీసుకురాకుండా ఉంచడమే మంచిది కదా.. తీసుకువచ్చి వెంటనే ఎలిమినేట్ చేయడం చూస్తుంటే ఇదంతా భరణి కోసం చాలా చక్కగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ లా అనిపిస్తోంది.
నన్ను బలిపశువుని చేశారు
వాళ్ళిద్దరినీ హౌస్ లోకి తీసుకువచ్చి చిత్ర విత్రమైన టాస్క్ లు పెట్టి చివరికి ఆడియన్స్ ఓటింగ్ అంటూ శ్రీజని సాగనంపారు. బయటకి వచ్చాక దమ్ము శ్రీజ ఈ తతంగంపై నిజాలు బయట పెడుతూ బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు చేసింది. భరణి గారిని హౌస్ లోకి తీసుకురావడం కోసమే ఈ రీ ఎంట్రీని క్రియేట్ చేశారు. ఆయన కోసం నన్ను బలిపశువుని చేశారు. భరణి గారిని హౌస్ లో ఉంచాలని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు.
భరణి గారి కోసమే ఇంత డ్రామా
అందుకే నన్ను వాడుకున్నట్లు అనిపిస్తోంది. కొన్ని రికమండేషన్స్ వల్ల భరణి గారిని హౌస్ లో ఉంచాలని వాళ్ళు ఈ ఫార్మాట్ క్రియేట్ చేశారు అని శ్రీజ విమర్శించింది. భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయ్యారు. నేను వైల్డ్ కార్డు ఎంట్రీల వల్ల ఎలిమినేట్ అయ్యాను. అలాంటి మా ఇద్దరికీ పోటీ ఏంటి ? మీరు నిజంగా ఎలిమినేట్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే.. మనీష్, ప్రియా, ఫ్లోరా లాంటి వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. కేవలం భరణి గారిని, నన్ను మాత్రమే పిలవడం ఏంటి అని శ్రీజ ప్రశ్నించింది.