- Home
- Entertainment
- బన్నీతో భారీ స్కెచ్ వేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్, 1000 కోట్ల బడ్జెట్ తో మరో సినిమా, అల్లు అర్జున్ ను అందుకోవడం ఇక కష్టమే
బన్నీతో భారీ స్కెచ్ వేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్, 1000 కోట్ల బడ్జెట్ తో మరో సినిమా, అల్లు అర్జున్ ను అందుకోవడం ఇక కష్టమే
మరో పాన్ వరల్డ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈసారి బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో.. భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడట. ఇంతకీ ఈ సినిమాకు బడ్జెట్ ఎంత? అధికారికంగా ఎప్పుడు ప్రకటించబోతున్నారు?

పాన్ వరల్డ్ మీద ఐకాన్ స్టార్ కన్ను
పాన్ ఇండియా రేంజ్‌లో రచ్చ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ వరల్డ్ మీద కన్నేశాడు. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన స్టార్ హీరో న్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2: ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొత్తం 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతకు ముందు ఉన్న బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసిందీ సినిమా.
అట్లీ సినిమాతో బన్నీ బిజీ బిజీ..
పుష్ఫ బ్లాక్ బస్టర్ హిటో తరువాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఈ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ తన కెరీర్‌లో కీలక అడుగులు వేస్తున్నారు. నెక్ట్స్ సినిమాలను చాలా జాగ్రత్తగా, భారీ స్థాయిలో సెలక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడా తన ఇమేజ్ తగ్గకుండా, ఫెయిల్యూర్స్ ఎదురవ్వకుండా ఉండేలా జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపుగా 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని సమాచారం. అవతార్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లపై పనిచేసిన ప్రముఖ విదేశీ టెక్నికల్ టీమ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఈమూవీకి సబంధించిన పనులు ముంబయ్ లో కొనసాగుతుండగా.. అల్లు అర్జున్ కూడా ముంబయ్ లో ఇల్లు తీసుకుని మరీ.. అక్కడే ఉంటూ పని చేస్తున్నాడు.
బాలీవుడ్ డైరెక్టర్ తో భారీ స్కెచ్..
ఇదిలా ఉండగా అల్లు అర్జున నెక్ట్స్ సినిమాలకు సబంధించి రకరకాల వార్తలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు.. భారీ బడ్జట్ నిర్మాతలు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం జాగ్రత్తగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో మరో కొత్త వార్త హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ ప్రాజెక్ట్ తరువాత అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయబోతున్నాడని సమాచారం.
భన్సాలీతో బన్నీ సినిమా ?
భన్సాలీతో సినిమా అంటే ఫుల్ మీల్స్ తిన్నట్టుగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. తనకు కావల్సిన అవుట్ పుట్ ను రాబట్టుకుంటాడు స్టార్ డైరెక్టర్. ఆయన సినిమా అంటేనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ గ్రాండ్ అపీరియన్స్ కు ప్రతీకగా చూస్తారు. భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన సావరియా, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూభాయ్ కాతియావాడి వంటి సినిమాలు చూస్తే.. ఆయన ఏంటో అర్ధం అవుతుంది. అటువంటి దర్శకుడు అల్లు అర్జున్‌తో కలసి ఒక పాన్ వరల్డ్ లెవల్ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. గతంలో కూడా ఓ సారి భన్సాలీతో బన్నీ భేటీ అయ్యారు కానీ ఎటువంటి వివరాలు తెలియలేదు. చాలా కాలం నుంచి వీరి కాంబోలో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకూ ఈ విషయాన్ని ఎవరు ధృవీకరించలేదు.
1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ..
ఇక భన్సాలీతో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించనున్నారని ఇండస్ట్రీ టాక్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈసినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకైతే ఈసినిమాపై అధికారిక సమాచారం మాత్రం లేదు. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగి, గ్లోబల్ స్టార్‌గా ఎదగడం ఖాయమని అంటున్నారు.