ప్రామిస్‌ చేస్తున్నా ఇది ఫస్ట్ స్టెమ్‌ మాత్రమే..అసలు కథ ముందుంది..అదేంటో చూపిస్తాః అల్లు అర్జున్‌

First Published Jan 12, 2021, 8:17 AM IST

`నిజంగా చెబుతున్నా.. `అల వైకుంఠపురములో` కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్‌ చేస్తున్నా. ఇది జస్ట్ ఫస్ట్ స్టెస్‌. అదేంటో యాక్షన్‌లో చూపిస్తా` అని అంటున్నారు స్టయిలీష్‌ స్టార్‌అల్లు అర్జున్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో(మంగళవారం)తో ఏడాది పూర్తి చేసుకుంది. 

ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రీబాష్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో బన్నీతోపాటు త్రివిక్రమ్‌, పూజా హెగ్దే, సునీల్‌, నవదీప్‌, సముద్రఖని, తమన్‌, అల్లు అరవింద్‌, సూర్య దేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. `అల వైకుంఠపురములో` తనకొక మెమరబుల్‌ సినిమా అని చెప్పారు.

ఈ ఏడాది మొత్తం సినిమా సందడి సాగిందని, సినిమా, పాటలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయని, ముఖ్యంగా పాటలు హంట్‌ చేస్తూనే ఉన్నాయన్నారు.

2020 ప్రపంచానికి మొత్తం బ్యాడ్‌ ఇయర్‌, కానీ నాకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఇయర్‌. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ పడిన ఏడాది. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా పడిన ఏడాది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోయి ఉంటే ఒక గొప్ప మెమరీని మిస్‌ అయ్యేవాళ్లమన్నారు.

త్రివిక్రమ్‌కి థ్యాంక్స్ చెప్పారు.  ఆయన దర్శకుడిగా ఉన్న రిలేషనే కాదు, వ్యక్తిగతంగానూ ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయన జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించారు. ఇన్‌స్పైర్‌ చేశారని చెప్పారు. ఆయన తనకు పెద్దన్నయ్య లాగా అని చెప్పారు.  జనరల్‌గా మగవాళ్లకి నేను లవ్‌ యూ చెప్పను. ఫస్ట్ టైమ్‌ మీకు చెబుతున్నా అని నవ్వులు పూయించారు.

ఇక `అల వైకుంఠపురములో` బ్లాక్‌ బస్టర్‌ గురించి చెబుతూ, `ప్రతి నటుడిగా ఏదో సమయంలో ఆల్‌ టైమ్‌ రికార్డ్ సినిమా పడుతుంది. కళ్యాణ్‌గారికి `ఖుషి` సినిమాతో ఆల్‌ టైమ్‌రికార్డ్ సినిమా పడింది. అలాగే ఎన్టీఆర్‌కి `సింహాద్రి`తో ఆల్‌టైమ్‌ రికార్డ్ సినిమా పడింది. చరణ్‌కి రెండో సినిమా `మగధీర`తో ఆల్‌టైమ్‌ రికార్డ్ సినిమా పడింది.

నాకూ పడుద్దా.. పడుద్దా..పదుద్దా.. అని వెయిట్‌ చేస్తున్నాను. దాదాపు ఇరవై సినిమాల తర్వాత ఆల్‌ టైమ్‌ రికార్డ్ సినిమా పడింది. అందరికి ప్రారంభంలోనే పడింది. నాకు మాత్రం 17ఏళ్ల తర్వాత పడింది.

పూజా హెగ్డేతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టినందుకు హ్యాపీగా ఉందన్నారు. ఇది ఇలానే కొనసాగాలని చెప్పారు.

ఈ సందర్భంగా నిజంగా చెబుతున్నా.. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ప్రామిస్‌ చేస్తున్నా.. ఇది ఫస్ట్ స్టెప్‌. ముందు అసలు కథ చూస్తారని చెప్పారు.

ఇందులో బన్నీ తనయ అల్లు అర్హ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. క్యూట్‌గా అందరిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా. ఈ సినిమాలో బన్నీ లుక్‌ ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్‌ అయ్యింది. ఆ గెటప్‌ని ఇంకా మెయింటేన్‌ చేస్తున్నారు బన్నీ. తాజా ఈవెంట్‌లో ఆయన లుక్‌ మరింత క్లారిటీ ఇచ్చింది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?