మెగా హీరోలకు అల్లు అర్జున్ సవాల్.. పవన్, చరణ్ లకు అంత సులభం కాదు!
అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు పుష్ప 2 నమోదు చేసింది. ఈ రికార్డును మెగా హీరోలు అందుకోవడం అంత సులభం కాదు. రామ్ చరణ్, పవన్ లకు అల్లు అర్జున్ సవాల్ విసిరినట్లు అయ్యింది..
మెగా-అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ.. అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. దీన్ని మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది.
పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు పరుష పదజాలంతో పరోక్షంగా అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగాడు. ప్రత్యర్థులకు మద్దతు తెలిపేవాడు మా వాడైనా పరాయివాడే అని అర్థం వచ్చేలా ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. అనంతరం డిలీట్ చేశాడు. సాయి ధరమ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడమైంది. హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పుష్ప చిత్రాన్ని టార్గెట్ చేశాడు.
ఇక జనసేన నేతలు బహిరంగంగా అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగారు. కీలక నేతలు నేరుగా విమర్శలు చేశారు. ఓ వేదికపై ఇష్టమైన వారి కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని, అల్లు అర్జున్ కూడా ఇండైరెక్ట్ గా... అసలు తగ్గేది లేదని, చెప్పకనే చెప్పాడు. మెగా అభిమానులు రెండుగా విడిపోయిన నేపథ్యంలో పుష్ప 2 పై చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి కట్టడం అనూహ్యపరిణామం. పుష్ప 2 ని తొక్కేస్తామని వారు హెచ్చరికలు చేశారు.
పుష్ప 2 విడుదలకు రెండు రోజుల ముందు ''చేసిన తప్పు వీలైనంత త్వరగా సరి చేసుకో'' అని నాగబాబు మరోసారి పరోక్షంగా అల్లు అర్జున్ ని హెచ్చరించాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎక్కడా... అల్లు అర్జున్ చిరంజీవి ప్రస్తావన తేలేదు. ఫైనల్లీ పుష్ప 2 థియేటర్స్ లోకి వచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూవీ అద్భుతం అని ట్విట్టర్ లో వరుస పోస్ట్స్ పెడుతున్నారు. వీరికి వైసీపీ కార్యకర్తలు తోడయ్యారు.
Allu Arjun - Pawan Kalyan
సినిమా చెత్తగా ఉంది. ప్రీమియర్స్ కి కూడా హాల్స్ నిండ లేదని చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రచారం మొదలుపెట్టారు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ గట్టిగా డ్యూటీ చేశారు. అయితే పుష్ప 2 పై జనాల్లో ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఇండియా వైడ్ ఈ మూవీ ఫీవర్ ఆవహించింది. పుష్ప 2కి జస్ట్ హిట్ టాక్ వచ్చింది. చెప్పాలంటే అబౌవ్ యావరేజ్. కానీ వసూళ్లు కుమ్మేసింది.
రూ. 500, 1000 పెట్టి టికెట్ కొనేందుకు కూడా ప్రేక్షకులు వెనకాడలేదు. పుష్ప 2 ఆర్ ఆర్ ఆర్(233 కోట్లు) , బాహుబలి 2(217 కోట్లు) రికార్డ్స్ సైతం బద్దలు కొట్టింది. పుష్ప 2 డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 250-280 కోట్ల మధ్యన ఉన్నాయట. ట్రేడ్ వర్గాలు ఈ మేరకు రిపోర్ట్ చేస్తున్నాయి. హిందీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా పుష్ప 2 నిలిచింది.
జవాన్, యానిమల్, స్త్రీ 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. హిందీ వెర్షన్ రూ. 72 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది దేవర హిందీ లైఫ్ టైం వసూళ్ల కంటే ఎక్కువ. బాలీవుడ్ లో హిట్ టాక్ వస్తే... వీకెండ్ వరకు వసూళ్లు పెరుగుతూ పోతాయి. అందులోను నాన్ హాలిడే రోజు పుష్ప 2 విడుదలైంది. కాబట్టి వీకెండ్ ఇంకా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది.
మెగా హీరోలతో కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సెట్ చేసిన ఈ రికార్డ్స్, చెమటలు పట్టించేలా ఉన్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి రామ్ చరణ్ ఆ చిత్రంతో అల్లు అర్జున్ ని బీట్ చేయకపోయినా, కనీసం పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ సైతం హరి హర వీరమల్లు తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు.
Allu Arjun Ram Charan
పుష్ప 2 వసూళ్లతో అల్లు అర్జున్ వారిద్దరికీ సవాల్ విసిరినట్లు అయ్యింది. మరి ఏ మేరకు అల్లు అర్జున్ తో బాబాయ్, అబ్బాయి తలపడతారో చూడాలి. పుష్ప 2 మూవీలోని కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీ ని ఉద్దేశించి అల్లు అర్జున్ చెప్పాడని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.