- Home
- Entertainment
- అల్లు అర్జున్ తన కొడుకుని ఏమని పిలుస్తాడో తెలుసా?.. బర్త్ డే రోజు సీక్రెట్ బయటపెట్టిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ తన కొడుకుని ఏమని పిలుస్తాడో తెలుసా?.. బర్త్ డే రోజు సీక్రెట్ బయటపెట్టిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా తన కొడుక్కి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టాడు బన్నీ.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన రేంజ్‌ని పెంచుకున్నాడు. నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు `పుష్ప2`తో తన రేంజ్‌ని చూపించేందుకు వస్తున్నాడు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఇండియాలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బన్నీ డాన్సులకు పడి చచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
అయితే బయట ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఇంట్లో మాత్రం తన పిల్లలకు తండ్రినే. అందరు ఫాదర్స్ లాగే తమ పిల్లలను ఆడిస్తాడు, ఆడుకుంటాడు. సరదాగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలతో కలిసి రిలాక్స్ అవుతుంటాడు. అయితే నేడు అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. బన్నీ, అల్లు స్నేహారెడ్డిలకు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కొడుక్కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు బన్నీ. సోషల్ మీడియా వేదికగా కొడుక్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో అయాన్‌కి ఇచ్చిన ట్యాగ్ ఏంటో రివీల్ చేశాడు అల్లు అర్జున్. బర్త్ డే విషెస్ చెబుతూ, లవ్ ఆఫ్ మై లైఫ్, నా చిన్నిబాబు అంటూ వెల్లడించారు. ఇందులో ఆయన్ని `మై నాటీ స్టార్` అని యాష్ ట్యాగ్‌ని పోస్ట్ చేయడం విశేషం.
అల్లు అయాన్‌కి ఇంట్లో నాటీ స్టార్ అనే ట్యాగ్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు బన్నీ. ఈ సందర్భంగా కొడుకుతో దిగిన ఫోటోలను పంచుకున్నాడు అల్లు అర్జున్. కిస్ పెడుతూ కొడుకుపై ప్రేమని వెల్లడించాడు. ఇందులో అయాన్ ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. మరింత కొంటెగా ఉంటుందని బన్నీ పలు మార్లు చెబుతుంటాడు. ఆమె ఇప్పటికే సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ మధ్య సమంత నటించిన `శాకుంతలం` చిత్రంలో బాల నటిగా మెరిసింది. బాల భరత పాత్రలో కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మరి బన్నీ తన కొడుకుని ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో చూడాలి.
ఇక ఐకాన్ స్టార్ ప్రస్తుతం `పుష్ప2` సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటి వరకు 60శాతం మాత్రమే షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 15న సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇక ఈ నెల 8న బన్నీ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా మూవీ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.