MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Top 10 Heroes: అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లను దెబ్బకొట్టిన తమిళ హీరోలు, ఎన్టీఆర్‌ లక్కీ.. నెంబర్‌ 1కి తిరుగులేదు

Top 10 Heroes: అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లను దెబ్బకొట్టిన తమిళ హీరోలు, ఎన్టీఆర్‌ లక్కీ.. నెంబర్‌ 1కి తిరుగులేదు

Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా ప్రకటించే ఇండియా మోస్ట్ పాపులర్‌ ఫిల్మ్ స్టార్స్ జాబితాలో ఈ సారి అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లకు గట్టి దెబ్బ పడింది. తమిళ హీరోలు దెబ్బకొట్టారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 21 2025, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ ఫిల్మ్ స్టార్స్
Image Credit : bollywoodmdb

టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ ఫిల్మ్ స్టార్స్

ఇండియాలో మోస్ట్ పాపులర్‌ ఫిల్మ్ స్టార్స్ కి సంబంధించిన ప్రతి నెల రిపోర్ట్ వస్తుంది. ఇందులో తెలుగు హీరోలతోపాటు, బాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోలు ప్రధానంగా ఉంటారు. అయితే ఇందులో ఎక్కువ భాగం మన తెలుగు స్టార్సే ఉండటం విశేషం. తాజాగా ఆగస్ట్ నెలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇందులో చాలా మంది స్టార్స్ స్థానాలు మారిపోయాయి. తెలుగు హీరో టాప్‌ 10 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో హీరో స్థానం తగ్గిపోయింది. అయితే ఇందులో తమిళ హీరోలు సత్తా చాటడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
నెంబర్‌ 1 ప్రభాస్‌
Image Credit : Asianet News

నెంబర్‌ 1 ప్రభాస్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన మోస్ట్ పాపులర్‌ మేల్‌ ఫిల్మ్ స్టార్స్ ఇండియా లిస్ట్ లో ఎప్పటిలాగే నెంబర్‌ వన్‌ స్థానంలో ప్రభాస్‌ నిలిచారు. గత కొంత కాలంగా ప్రభాసే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటున్నారు. ఆయన్ని టచ్‌ చేసే వారు లేరనే చెప్పాలి. ఆయన ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్‌ పరంగా ఆయన్ని టచ్‌ చేసేవారు లేరు,  పాపులారిటీ విషయంలోనూ ఆయన్ని టచ్‌ చేసేవారు లేరని చెప్పొచ్చు.

38
రెండు మూడు స్థానాల్లో విజయ్‌, అజిత్‌
Image Credit : Asianet News

రెండు మూడు స్థానాల్లో విజయ్‌, అజిత్‌

ఇక రెండో స్థానం కూడా కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌కి ఫిక్స్ అయిపోయింది. ఒకటి రెండు సార్లు మాత్రమే మార్పు కనిపించింది. దాదాపు అన్ని నెలలు ఆయన రెండో స్థానంలో ఉంటున్నారు. అయితే ఎప్పుడు ఐదవ స్థానంలో ఉండే అజిత్‌ ఇప్పుడు మూడో స్థానానికి రావడం విశేషం. ఒకేసారి ఆయన రెండు స్థానాలు పెరిగి మూడో స్థానంలో నిలిచారు. బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ నాల్గో స్థానానికి పడిపోయారు. ఆయన గతంలో మూడో స్థానంలో ఉండేవారు.

48
దుమ్ములేపిన ఎన్టీఆర్‌
Image Credit : Asianet News

దుమ్ములేపిన ఎన్టీఆర్‌

తెలుగు స్టార్స్ కి సంబంధించి ఎన్టీఆర్‌ స్థానం మెరుగుపడింది. ఆయన చాలా వరకు  చివరి రెండు రెండు మూడు స్థానాల్లో ఉండేవారు. కానీ ఆగస్ట్ నెలలో ఏకంగా ఐదో స్థానానికి మెరుగయ్యారు. అయితే గత నెలలో తారక్‌ `వార్‌ 2`లో నటించారు. దీంతో ఆ నెల మొత్తం ఎన్టీఆర్‌కి సంబంధించిన చర్చ జరిగింది. అలా తారక్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాలో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

58
పడిపోయిన అల్లు అర్జున్‌ స్థానం
Image Credit : facebook / Allu Arjun

పడిపోయిన అల్లు అర్జున్‌ స్థానం

ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండే బన్నీ ఆగస్ట్ లో చాలా డౌన్‌ అయ్యారు. ఆయన ఏకంగా ఆరో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఎన్టీఆర్‌ తర్వాత స్థానానికి పరిమితమయ్యారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చ తరచూ జరుగుతూనే ఉంది. కానీ ఈ మూవీకి క్రేజ్‌, హైప్‌ మాత్రం రావడం లేదు. ఇదే బన్నీ స్థానం పడిపోవడానికి కారణంగా చెప్పొచ్చు.

68
మహేష్‌ బాబు స్థానం పదిలం
Image Credit : our own

మహేష్‌ బాబు స్థానం పదిలం

ఏడో స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిలిచారు. ఆయన ఆరు, ఏడు స్థానాల్లో ఉంటున్నారు. ఒక స్థానం అటుఇటుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఏడో స్థానంలో నిలిచారు. రాజమౌళితో ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు మహేష్‌.

78
టాప్‌ 10లోకి దూసుకొచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీ
Image Credit : Facebook/Rajinikanth

టాప్‌ 10లోకి దూసుకొచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీ

ఇంకోవైపు ఎనిమిదో స్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలిచారు. ఆయన ఎప్పుడూ ఈ టాప్‌ 10లోకి రాలేదు. అయితే గత నెలలో ఆయన హీరోగా నటించిన `కూలీ` మూవీ విడుదలైంది. ఇది బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. దీంతో రజనీకాంత్‌కి సంబంధించి దేశ వ్యాప్తంగాచర్చ జరిగింది. అది ఆయన ఇమేజ్‌ని, క్రేజ్‌ని, పాపులారిటీని పెంచిందని చెప్పొచ్చు. అందుకే టాప్‌ 8లో నిలిచారు. టాప్‌ 9, 10 స్థానాలను సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు దక్కించుకున్నారు.

88
టాప్‌ 10లో స్థానం కోల్పోయిన రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

టాప్‌ 10లో స్థానం కోల్పోయిన రామ్‌ చరణ్‌

గతంలో చాలా వరకు ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉండే రామ్‌ చరణ్‌, ఈ సారి మాత్రం అసలు టాప్‌ 10లోనే లేరు. ఇది ఆయనకు అవమానమనే చెప్పాలి. అయితే రామ్‌ చరణ్‌ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్లు లేవు. పైగా రజనీకాంత్‌, అక్షయ్‌, సల్మాన్‌లకు సంబంధించిన సినిమాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వారు ట్రెండింగ్‌లోకి వచ్చారు. రామ్‌ చరణ్‌ టాప్‌ 10 లో స్థానాన్ని కోల్పోయారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ప్రభాస్
మహేష్ బాబు ఘట్టమనేని
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
బాలకృష్ణని కోలుకోలేని దెబ్బకొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఈ ఇద్దరికి మైండ్‌ బ్లాక్‌ చేసిన రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌
Recommended image2
పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ముగ్గురికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved