MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త కోడలితో మెగా ఫ్యామిలీ క్రిస్మస్‌ సెలబ్రేషన్‌.. కంటెంట్‌ ఇచ్చిన అల్లు స్నేహా రెడ్డి..అందరి చూపు వారిపైనే

కొత్త కోడలితో మెగా ఫ్యామిలీ క్రిస్మస్‌ సెలబ్రేషన్‌.. కంటెంట్‌ ఇచ్చిన అల్లు స్నేహా రెడ్డి..అందరి చూపు వారిపైనే

కొత్త కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మెగా ఫ్యామిలీ క్రిస్మస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందులో రెండు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 26 2023, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏ ఫంక్షన్‌ అయిన, ఏ పండగ అయినా కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం మెగా ఫ్యామిలీ ఆనవాయితి. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒక్క చోటికి చేరి పండగని మరింత స్పెషల్‌గా చేసుకుంటారు. సంక్రాంతి కానీ, దీపావళి కానీ, ఇలా సందర్భం ఏదైనా ఈ రెండు ఫ్యామిలీలు కలవాల్సిందే. అందు బాటులో ఉన్న వాళ్లంతా కలిసి పండగ చేసుకుంటారు. 

26

ఇప్పుడు క్రిస్మస్‌ పండుగ సందర్భంగా వీరంతా మరోసారి కలుసుకున్నారు. తాజాగా వారు దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ వారంతా తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఆయా పిక్స్ ని పోస్ట్ చేసి మేరీ క్రిస్మస్‌ అంటూ అందరికి క్రిస్మస్‌ విషెస్‌ తెలిపారు. ఆ పిక్స్ మెగా, అల్లు ఫ్యామిలీలను ఆకట్టుకుంటున్నాయి. 
 

36

ఇందులో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, అల్లు బాబీ, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, ఉపాసన, అల్లు స్నేహారెడ్డి, నిహారిక, శ్రీజ, సుస్మిత, వారి పిల్లలు ఉన్నారు. వీరితోపాటు కొత్త జంట వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

46

కొత్త కోడలితో కలిసి ఇలా మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్‌ సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. అయితే ఇదొక విశేషం. ఇందులో మరో రెండు ఆసక్తికర విషయాలు జరిగాయి. అవే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో పెద్ద వాళ్లు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్‌, పవన్‌ మిస్సింగ్‌. వారంతా ఫోటోలో మాత్రమే లేకపోయి ఉండొచ్చు. 
 

56

ఇందులో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌ అని చెప్పొచ్చు. అయితే వీరి మధ్య గ్యాప్‌ వచ్చిందంటూ చాలా పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలవడం మరో విశేషం. 
 

66

ఇందులో మరో ఆసక్తికర విషయం అల్లు స్నేహారెడ్డి, అల్లు బాబీ కలిసి ఫోటో దిగడం. చాలా సరదాగా, హ్యాపీ మూడ్‌లో దిగిన ఫోటో ఇది. బాబీకి అల్లు స్నేహారెడ్డి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో చాలా వైరల్‌ అవుతుంది. ఇంటర్నెట్‌ ని ఊపేస్తుంది.  గతంలో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ మధ్య దారుణమైన ట్రోలింగ్‌ జరిగింది. ఆ సమయంలో దారుణంగా తిట్టుకున్నారు. అనేక షాకింగ్‌ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోటో మరోసారి కంటెంట్‌ ఇచ్చినట్టయ్యింది.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Recommended image2
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image3
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved