‘పుష్ప -2’: 18 నిముషాల ఫుటేజ్ మేటర్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. హిందీ వెర్షన్ చాలా బాగా ఆడుతోంది మరియు మొత్తం కలెక్షన్లు 1200 కోట్లకు చేరుకున్నాయి. ఓటిటి విడుదల తేదీ మరియు అదనపు ఫుటేజ్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
Pushpa 2: The Rule
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న విడుదలై ఇప్పటికి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. జనవరి 4తో ఈ సినిమా విడుదలై నెల రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లు పరంగా రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది.
పుష్ప-2 చిత్రం రిలీజై నెల దాటినా ఇప్పటికి కలెక్షన్స్ పరంగా తన సత్తా చూపిస్తోంది. విడుదలైన 31వ రోజైన శనివారం ‘పుష్ప -2’ సినిమా దేశవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌లో రూ.1 కోటి, హిందీ వెర్షన్‌లో రూ. 4.35 కోట్లు, తమిళం, కన్నడ వెర్షన్లలో కలిపి రూ.15 లక్షలు కొల్లగొట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,200 కోట్ల మైలురాయికి చేరువయ్యాయి. శనివారం నాటికి రూ.1,199 కోట్లకు చేరుకున్నాయని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ పేర్కొంది.
జనవరి 5 ఆదివారం కావడం, థియేటర్లలో ఇతర చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో పుష్ప-2 వసూళ్లు గణనీయంగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా కలెక్షన్లు రూ.1,800 కోట్లు దాటాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు వస్తుండడంతో పుష్ప-2 వసూళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
Allu Arjun, Pushpa 2
పుష్ప 2 చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడుతున్నారు. జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. 56 రోజుల డెడ్‍లైన్ అప్పటికి ముగుస్తుందని, దీంతో ఆరోజు స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ అయిందని అంటున్నారు.
అలాగే అదే సమయంలో ఈ సినిమాకు 18 నిముషాల ఫుటేజ్ ఎగస్ట్రా కలపబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే సినిమా పెద్దదైందని అనేవాళ్లు ఉన్నారు. అలాంటప్పుడు ఎగస్ట్రా ఫుటేజ్ కలపటం అవసరమా అనే డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు ఇప్పుడు నెట్ ప్లిక్స్...సెన్సార్ కాని ఫుటేజ్ ని కలపటానికి ఆసక్తి చూపటం లేదు. కాబట్టి 18 నిముషాల మేటర్ కాస్తంత కష్టమే.
పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ.250 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ విషయంలోనూ పుష్ప 2 రికార్డు సాధించింది. థియేటర్లలోనూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది.
"పుష్ప 2" సినిమా ఒక అద్భుతమైన ర్యాంపేజ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.ఓటిటిలోనూ ఆ మ్యాజిక్ జరుగుతుందని భావిస్తున్నారు. మొదటి భాగం "పుష్ప" తోనే గొప్ప విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ఈ చిత్రం ద్వారా మరింత పెరిగిన అభిమానాన్ని పొందారు. సినిమా లోని యాక్షన్ సీక్వెన్సులు, మ్యూజిక్, డైలాగ్స్, అల్లు అర్జున్, రష్మిక డాన్స్ లు, జాతర సీక్వెన్స్ లు అన్నీ ప్రేక్షకులకు మోహనంగా నిలిచాయి.