పుష్ప 2 ఆడియో రైట్స్ కి బాంబు లాంటి ధర.. ఇండియన్ సినిమాలోనే రికార్డు డీల్ ?
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ఇంకా చిత్రీకరణ చాలా ఉన్నప్పటికీ సినిమాపై ప్రారంభమలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు.

Pushpa 2 Teaser
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ఇంకా చిత్రీకరణ చాలా ఉన్నప్పటికీ సినిమాపై ప్రారంభమలోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ కనీవినీ రుగని విధంగా భారీ బడ్జెట్ లో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ని, సినీ ప్రేక్షకులని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అప్పుడే పుష్ప 2 బిజినెస్ మొదలైనట్లు సమాచారం.
తాజా విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప 2 ఆడియో హక్కులని టి సిరీస్ సంస్థ ఏకంగా రూ 65 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలోనే ఇది కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్ర అని చెప్పొచ్చు. పుష్ప రాజ్ రికార్డుల వేట ప్రారంభించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆడియో హక్కుల విషయంలో పుష్ప 2 ఇండియన్ సినిమాలోనే టాప్ లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ 26 కోట్లు, పొన్నియిన్ సెల్వన్ 24 కోట్లు, సాహో 22 కోట్లు , లియో 16 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ముంబైలో పుష్ప నిర్మాతలతో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ 65 కోట్లు కేవలం ఆడియో వరకే పరిమితమా లేక టి సిరీస్ కి అదనంగా వేరే ఏమైనా రైట్స్ కూడా దక్కుతాయా అనేది క్లారిటీ లేదు. మొత్తంగా ఆడియో రైట్స్ డీల్ అయితే ముగిసినట్లు తెలుస్తోంది.
పుష్ప మొదటి భాగం నార్త్ లో ఆ రేంజ్ హిట్ కావడం వెనుక మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. దేవిశ్రీ అందించిన బిజియంపై విమర్శలు వచ్చినప్పటికీ పాటలు మాత్రం అదరగొట్టేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఆడియన్స్ లో కి బాగా తీసుకెళ్లింది పాటలే. అందువల్లే పుష్ప 2 సాంగ్స్ కి ఈ రేంజ్ క్రేజ్ డిమాండ్ ఏర్పడింది. ఆడియో రైట్స్ ఈ రేంజ్ లో ఉంటే ఇక ఓటిటి, శాటిలైట్, థియేట్రికల్ బిజినెస్ మోత మోగడం ఖాయం.