MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్ రేటుకు ‘పుష్ప-2’హిందీ రైట్స్ , ఇంటర్వెల్ ముందు ఆ ఎపిసోడ్ కోసమే...

షాకింగ్ రేటుకు ‘పుష్ప-2’హిందీ రైట్స్ , ఇంటర్వెల్ ముందు ఆ ఎపిసోడ్ కోసమే...

తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలలో పుష్ప చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లోనే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం సీక్వెల్ పుష్ప : ది రైజ్ పైన ప్రేక్షకులకు ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి.  

3 Min read
Author : Surya Prakash
| Updated : Apr 12 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Pushpa 2

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ . ఆ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిజినెస్ ప్రారంభమైంది. నార్త్ లోనూ మంచి రేటుకు ఈ సినిమా రైట్స్ వెళ్లాయని తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Pushpa 2 teaser

Pushpa 2 teaser

ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్  క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.  గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
 

310

ముంబై డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 300 కోట్లకు అమ్ముడైంది. ఇదొక ఫ్యాన్సీ డీల్ అని చెప్పాలి. అల్లు అర్జున్ కు మాత్రమే కాదు తెలుగు సినిమాకు కూడా ఇది భారీ రేటే. అల్లు అర్జున్ తన తోటి హీరోలను ఈ సినిమాతో దాటినట్లు అయ్యింది. అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు  వారాలు అయినా హౌస్ ఫుల్స్ తో నార్త్ లో  ఆడాలని అంటున్నారు.  
 

410

ఇక ఈ చిత్రంలో తెరపై ఆరు నిముషాలు పాటు వచ్చే ఓ ఎపిసోడ్ ...హైలెట్ కానుందని చెప్తున్నారు. అదే జాతర ఎపిసోడ్. ఇంటర్వెల్ దగ్గర వస్తుందని చెప్తున్నారు.  దాన్ని నమ్మి  నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు.  మొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు హీరో జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం కూడా కలిసొచ్చే అంశం.

510
pushpa 2

pushpa 2

తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలలో పుష్ప చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లోనే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం సీక్వెల్ పుష్ప : ది రైజ్ పైన ప్రేక్షకులకు ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి.    పుష్ప: ది రూల్ సినిమాకి రెండో భాగం అనగా పుష్ప: ది రైజ్ ఎండ్ కార్డ్ వేస్తుంది అనుకున్నారు అందరూ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది.

610

 పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ తరువాత వచ్చే భాగానికి పుష్ప రోర్ అని టైటిల్ ని కూడా అనుకుంటున్నారట. ఇలా మూడు పార్టులుగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు అంటున్నారు. ధర్డ్ పార్ట్  అంటే వినటానికి బాగానే ఉంది కానీ దీన్ని తెరకెక్కించాలంటే ముందుగా సెకండ్ పార్ట్ క్లిక్​ అవ్వడం చాలా అవసరం.

710

 ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప'కి కూడా ముందుగానే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్​ చేశారు. కానీ ఇప్పుడు మూడో భాగం అన్నది కొత్తగా వచ్చిన ప్రచారం.   ఈ మూడో భాగం కథ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించి ఆ తరువాత మూడో భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని సమాచారం. 
 

810

రెండో భాగంలో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్​లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్​ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్​లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్​గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.

910

‘పుష్ప: ది రూల్‌’ సినిమా విషయానికి వస్తే భారీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.   ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
 

1010

 ఆ మధ్యన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్‌ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ
Recommended image2
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image3
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved