MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun 'పుష్ప 2: ది రూల్' మ‌రో రికార్డు

Allu Arjun 'పుష్ప 2: ది రూల్' మ‌రో రికార్డు

Pushpa 2: 2024లో బిగ్ స్టార్, భారీ బ‌డ్జెట్ చిత్రాలు చాలానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అయితే అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డుల మోత మోగిస్తోంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 20 2024, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Pushpa 2 most-watched movie of the year: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇచ్చిన పుష్ప 2: ది రూల్ రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ ఏడాదిలో అత్య‌ధిక వ‌సూళ్లు రాబట్టిన సినిమాగా ఇప్ప‌టికే అనేక రికార్డులు సాధించిన పుష్పరాజ్ అల్లుఅర్జున్ సినిమా మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2024 లో టాప్ సినిమాగా పుష్ప 2

2024 ఏడాది ముగింపు దశకు చేరుకోవడంతో బుక్ మై షో త‌న త‌న #BookMyShowThrowbackను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది భార‌త్ లో వినోదం కోసం ఏ మాత్రం తగ్గని సంవత్సరంగా పేర్కొంది. 2024 సంవత్సరంలో ఫైటర్, స్ట్రీ 2 , సింగం ఎగైన్, భూల్ భూలయ్యా 3 తో సహా చాలా ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అయితే, అల్లు అర్జున్, రష్మిక మందన్నల పుష్ప 2: ది రూల్ చిత్రం ఏ ఏడాదిలో వ‌చ్చిన సినిమాల్లో నెంబ‌ర్.1గా నిలిచింది. 

35

అత్య‌ధికం వీక్షించిన చిత్రంగా పుష్ప 2

భారీ బ‌డ్జెట్ తో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన పుష్ప 2 అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం బుక్‌మైషో ద్వారా ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ఘనత సాధించింది. 

అలాగే, పుష్ఫ 2: ది రూల్ 10.8 లక్షల మంది సోలో వీక్షకులను ఆకర్షించింది. నవంబర్ 1, 2024, BookMyShowలో బ్లాక్‌బస్టర్ రోజు కేవలం 24 గంటల్లోనే అత్యధికంగా 2.3 మిలియన్ టిక్కెట్లు అమ్ముడై రికార్డులను బద్దలు కొట్టింది.

45

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పుష్ప‌ 2

పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  సినీ మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. ఈ చిత్రం భారతదేశంలో 15 రోజుల్లో ₹ 990.6 కోట్ల నికర వసూలు చేసి, రూ. 1181.4 కోట్ల గ్రాస్ సాధించింది. 15 రోజుల్లో పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ₹ 1416.40 కోట్లతో, ₹ 235 కోట్ల ఓవర్సీస్ కలెక్షన్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం త‌న‌ రెండవ గురువారం భారతదేశంలో ₹ 17.65 కోట్లను సంపాదించింది. దీంతో ఈ చిత్రం 2వ వారం వసూళ్లు ₹ 264.8 కోట్లకు చేరాయి. పుష్ప 2 మొదటి వారంలో ₹ 725.8 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ చిత్రం 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹ 1508 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పేర్కొంటూ పుష్ప చిత్ర బృందం గురువారం పోస్టర్‌ను విడుదల చేసింది.

55
pushpa 2

pushpa 2

పుష్ప 2 తో వివాదంలో అల్లు అర్జున్

 

పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. అయితే, పుష్పరాజ్ న్యాయపరమైన చిక్కులు సినిమా కలెక్షన్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. డిసెంబర్ 4న పుష్ప 2  ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ని సందర్శించాడు. బన్నీ రాకతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె చిన్న కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలోనే కేసు నమోదైంది. 

డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి, రాత్రి చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉంచారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించగా, తెలంగాణ హైకోర్టు అతనికి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలిని అతని తండ్రి అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ ఆసుపత్రిలో పరామర్శించారు. 
 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Recommended image2
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image3
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved