పుష్పరాజ్ దండయాత్ర, రికార్డు స్థాయిలో పుష్ప 2 బుకింగ్స్, ఫస్ట్ డే ఎన్ని కోట్లు అంటే?
పుష్ప 2 సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. ఈ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి.
Puspha 2
పుష్ప 2 వరల్డ్ వైడ్ 12000 లకు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4వ తేదీ అర్ధరాత్రి నుండే పేయిడ్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వాలు టికెట్స్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
అటు ఓవర్సీస్, ఇటు డొమెస్టిక్ గా పుష్ప 2 సత్తా చాటుతుంది. వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయట. మరో రెండు రోజుల సమయం ఉంది. ఈ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. పుష్ప ది రూల్ తెలుగు 2D వెర్షన్ రూ. 17.16 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దక్కించుకుందట. అనంతరం హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ రూ. 12 కోట్లు అట. తమిళ్ రూ. 82 లక్షలు, మలయాళ రూ. 1 కోటి అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిందట.
ఇప్పటి వరకు ఇండియాలో 35.7 కోట్ల నెట్ వసూళ్లు ప్రీ సేల్స్ ద్వారా పుష్ప 2 రాబట్టిందట. బ్లాక్ చేసిన సీట్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటే రూ. 50 కోట్ల నెట్ వసూళ్లకు పుష్ప 2 ప్రీ సేల్స్ చేరాయని అంటున్నారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల అంచనా ప్రకారం పుష్ప 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 250 నుండి 275 కోట్ల గ్రాస్ వసూలు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
కాగా పుష్ప 2 టికెట్స్ ధరలు ఇతర స్టార్ హీరోల చిత్రాల కంటే రెండు, మూడింతల రెట్లు అధికంగా ఉన్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నాయనే వాదన కూడా ఉంది. టికెట్స్ ధరలు తగ్గాక, టాక్ ఆధారంగా సినిమాకు వెళ్లొచ్చని కొందరు ఆలోచన చేస్తున్నారు. కొన్ని థియేటర్స్ లో పుష్ప 2 టికెట్ ధర రూ. 900 కూడా ఉంది.
పుష్ప 2 భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క నైజాం రైట్స్ రూ. 100 కోట్లు పలికాయి. ఆంధ్రా, సీడెడ్ కలుపుకుని మరో రూ. 120 కోట్ల బిజినెస్ చేసిందట. ఏపీ, తెలంగాణలలో పుష్ప 2 రూ. 420 కోట్ల గ్రాస్ రాబడితే గాని హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ వసూళ్లకంటే అత్యధికంగా పుష్ప 2 రాబట్టాల్సి ఉంది.
2021లో విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 వస్తుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 400 కోట్లు. వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. పుష్ప 2 డిజిటల్ రైట్స్ ద్వారానే రూ. 275 కోట్లు ఆర్జించినట్లు ట్రేడ్ వర్గాల టాక్.