దిల్‌రాజుకి బిగ్ హ్యాండిచ్చిన బన్నీ.. బోయపాటి, `సలార్` డైరెక్టర్‌తో సినిమా.. `ఐకాన్` లేనట్టేనా?
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాల విషయంలో ఊహించని విధంగా కొత్త కాంబినేషన్లని సెట్ చేస్తున్నారు. అదే సమయంలో దిల్‌రాజుకి హ్యాండిచ్చినట్టు తెలుస్తుంది. `ఐకాన్` సినిమాని పక్కన పెట్టాడా? అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా `వకీల్‌సాబ్` దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు `ఐకాన్` సినిమా చేయాల్సి ఉంది.
కానీ దాని స్థానంలో కొరటాల శివతో సినిమా ప్రకటించాడు బన్నీ. ఇటీవలే అది రద్దయ్యింది. కొన్నాళ్లపాటు ఆ సినిమా లేదనే సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్‌తో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న బన్నీకి నెక్ట్స్ సినిమా ఏం చేయబోతున్నాడనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త వార్త వైరల్ అవుతుంది.`కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. `ఐకాన్` కంటే ముందు ఈ `సలార్` డైరెక్టర్‌తో సినిమా ఉంటుందట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో `సలార్` రూపొందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి అన్ని రోజులు బన్నీ వెయిట్ చేస్తాడా? ఈ లోపు మరే ఇతర సినిమా చేస్తాడా? అన్నది ప్రశ్నార్థకంగా, సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చలు జరిగాయాని టాక్. బన్నీ ఇమ్మిడియెట్‌గా ఈ సినిమానే ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా, అలాగే కొరటాల శివ సినిమా ఉంటాయని టాక్. ఈ లెక్కన `ఐకాన్` లేనట్టే అని చెప్పొచ్చు.
ఈ మూడు సినిమాల తర్వాత `ఐకాన్` ఉంటుందా? అంటే చెప్పడం కష్టమే. మొత్తంగా `ఐకాన్` దాని ట్యాగ్‌లైన్ లాగే కనిపించకుండా పోయేలా ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే దిల్‌రాజు తమ నెక్ట్స్ సినిమాగా `ఐకాన్` ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే. అంటే ఆయన హీరోని మార్చేస్తాడా? అన్నది చూడాలి.
బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 13న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.