MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `పుష్ప` చేయి గుర్తు.. అల్లు అర్జున్‌ కొత్త బ్రాండ్‌ అదిరిందిగా.. ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే

`పుష్ప` చేయి గుర్తు.. అల్లు అర్జున్‌ కొత్త బ్రాండ్‌ అదిరిందిగా.. ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే

ఐకాన్‌ స్టార్‌ ఏది చేసినా ట్రెండే. నేను ట్రెండ్‌ని ఫాలో కాను, ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తానని నిరూపిస్తున్నారు. స్టయిల్‌కి ఐకాన్‌గా నిలిచిన బన్నీ ఇప్పుడు తన `ఇది సార్‌ నా బ్రాండ్‌` అంటూ ఫ్యాన్స్ కి సరికొత్త బ్రాండ్‌ని పరిచయం చేస్తున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 10 2022, 09:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అల్లు అర్జున్‌(Allu Arjun), ఐకాన్‌ స్టార్‌, పుష్ప.. ఇప్పుడు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేర్లపైనే చర్చ. బన్నీ నటించిన `పుష్ప`(Pushpa) చిత్రం ఊహించని విధంగా భారీ విజయం సాధించడంతో `పుష్ప` కలెక్షన్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో Allu Arjun తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్‌ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న `రౌడీబాయ్స్` చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలోని సాంగ్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి బన్నీ గెస్ట్ గా హాజరయ్యారు. 

27

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు తన ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు అంటూ సంభోదించడం విశేషం. దీంతో అభిమానులు గోలతో కేకలు పెట్టారు. ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. 
 

37

ఈ సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు బన్నీ. వెనక్కి తిరిగి తన బ్రాండ్‌ని పరిచయం చేశారు. అది చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సర్‌ప్రైజ్‌తో అరుస్తూ గోల చేశారు. అందరికి సరదాగా సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఇలా చేశానని తెలిపారు బన్నీ. 

47

ఇంతకి అందులో ఏముందంటే.. `పుష్ప` చిత్రంలో క్లైమాక్స్ లో పోలీస్‌ అధికారి భన్వర్‌సింక్‌ షేకావత్‌ పాత్రలో నటించిన ఫహద్‌ ఫాజిల్‌కి తన బ్రాండ్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఫహద్‌ తనకంటూ ఓ బ్రాండ్‌ ఉందని, నీకు బ్రాండ్‌ ఉందా అంటూ ప్రశ్నించాడు. నీ తండ్రి ఎవరూ ? అంటూ అవమానించాడు. అందుకోసం తన బ్రాండ్‌ ఏంటో చూపించాలని ఓ ఫారెస్ట్ కి తీసుకెళ్లి మరీ తన బ్రాండ్‌ చూపించారు బన్నీ. 

57

పిస్తోల్తో తనచేయిని కాల్చుకుని రక్తం కారుతున్నఅరచేతిని తన షర్ట్ పై గట్టిగా కొట్టుకుని, రక్తం మరకలతో పడ్డ అరచేతి గుర్తు ప్రింట్‌ని చూపిస్తూ `ఇది సార్‌ నా బ్రాండ్‌` అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. క్లైమాక్స్ లో ఈ సీన్‌ అదిరిపోయిందని చెప్పాలి. 

67

తాజాగా అదే డైలాగ్‌ని ప్రింట్‌చేయించాడు బన్నీ. తన టీషర్ట్ పై `అరచేతి గుర్తు, ఇది సార్‌ నా బ్రాండ్‌` అంటూ రెడ్‌ కలర్‌లో ప్రింట్‌ చేయించారు. ఆ టీషర్ట్ వేసుకుని మరీ `రౌడీబాయ్స్` ఈవెంట్‌లో పాల్గొన్నారు. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు బన్నీ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా బన్నీ తన కొత్త బ్రాండ్‌ని పరిచయం చేశారని చెప్పొచ్చు. 

77

ఇక చూసిన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ప్రింట్‌ చేసిన టీషర్ట్ కావడంతో ఇక అంతా దీన్ని కొంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడిదే ఓ బ్రాండ్‌గా మారిపోతుందని చెప్పొచ్చు. అంతకు ముందు తన ఫ్యామిలీతో కలిసి లంచ్‌ చేస్తున్న సమయంలోనూ అదే టీషర్ట్ తో కనిపించారు బన్నీ. ఈ రోజు(జనవరి 10) తండ్రి,నిర్మాత అల్లు అరవింద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంతా కలిసి అల్లు అరవింద్‌ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bade Sahab Transformation: ధురంధర్ 2లో 'బడే సాహెబ్' ఈయనే..9 గంటల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మేకోవర్
Recommended image2
Priyamani: 'రావణ్' తర్వాత బాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయనుకున్నా, కానీ..తన భర్తపై ప్రియమణి తొలిసారి కామెంట్స్
Recommended image3
Divi Vadthya: పుష్ప 2 కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు, మూవీ చూశాక ఎందుకు ఒప్పుకున్నానా అని ఆవేదన చెందా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved