MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజుకి బన్ని ఇలా చేస్తారని అసలు ఊహించం

పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజుకి బన్ని ఇలా చేస్తారని అసలు ఊహించం

అల్లు అర్జున్‌ (Allu Arjun) తాజాగా విషెస్‌ తెలుపుతూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టడం చర్చగా మారింది.  

3 Min read
Author : Surya Prakash
Published : Sep 02 2024, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


 ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ. తన స్టైల్‌తో, నటనతో  కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజు ఈ రోజు. దాంతో  ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా పవన్‌కు పుట్టన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) తాజాగా విషెస్‌ తెలుపుతూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టడం చర్చగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడి ఘన విజయం సాధించి కింగ్ మేకర్ అయ్యారు. అయితే  పవన్, అల్లు అర్జున్ మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్దం కొనసాగుతుంది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ సపోర్ట్ చేయడం ఈ వివాదానికి తెరలేపింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ వ్యవహారంపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పలు రకాలు విమర్శలు కూడా చేశారు.

ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్‌ను కలిసింది లేదు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయటం విశేషంగా మారింది.  ‘‘హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది అందరి  దృష్టిని ఆకర్షిస్తోంది.
 

310


ఇక   ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలియచేస్తూ... ‘‘ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మన పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకంక్షలు’’ అన్నారు.
 

410


       ‘‘వన్‌ అండ్‌ ఓన్లీ పవర్‌స్టార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.  మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని.. ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నా. వినయం, అంకితభావంతో మీరు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇలాగే ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నా’’ - బన్నీ వాస్‌

510


    ‘‘ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే జెండా పట్టిన జనసైనికులకు, నమ్మి నడిచిన నాయకులకు, నువ్వు వస్తే మార్పు తెస్తావ్ అని‌ ఎదురుచూసే నాలాంటి ఎంతోమందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి. ఉన్నత విలువలున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు‌ జనసేనాని’’ - నాగబాబు

610


    ‘‘అందీ’ (తుపాన్‌) ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన నాయకుడు.. ఎన్నో లక్షల మంది ఆశాకిరణం.. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు హ్యాపీ బర్త్‌డే. కోట్లాది మంది ప్రేమ, ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ - మెహర్‌ రమేశ్‌

710


    ‘‘ఇతడే మన కళ్యాణ్ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకూ ఎదిగిన మీ చరిత్ర అనితర సాధ్యం  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం.  అన్నయ్య కు తమ్ముడిగా మొదలై లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి  కథానాయకుడిగా గెలిచి ప్రజల నాయకుడిగా నిలిచిన మీ జీవితం స్ఫూర్తి దాయకం. హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌’’ -  ఎస్‌కెఎన్‌
 

810


‘‘గొప్ప స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజాసేవలో నిమగ్నమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన మీ ప్రస్థానం ఒక అధ్యాయం. రాజకీయ ప్రయాణంలో మీ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మీరు వేసిన అడుగులు చరిత్రాత్మకం. ప్రజా నాయకుడిగా మీరు మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ - చంద్రశేఖర్‌ పెమ్మసాని

910


    ‘‘సంకల్పమే బలం, జనహితమే ధ్యేయంగా.. జన సంక్షేమం కోసం తపిస్తున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ కొండగట్టు ఆంజనేయస్వామి కృపతో ఎల్లప్పుడూ ప్రజా సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ - బండి సంజయ్‌ కుమార్‌

1010

    ‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన వ్యవస్థాపకులు పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై మీకున్న అంకితభావం, పట్టుదల అభినందనీయం. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ - కిషన్‌రెడ్డి

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved