అల్లరి నరేష్ 'బచ్చలమల్లి’ : OTT రిలీజ్ డేట్, ఫ్లాట్ ఫామ్
అల్లరి నరేష్ నటించిన 'బచ్చలమల్లి' చిత్రం ఓ ఊరమాస్ కథాంశంతో తెరకెక్కింది. 1990 నేపథ్యంలో ట్రాక్టర్ డ్రైవర్ పాత్రలో నరేష్ కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది ఓటిటిలో కి త్వరలో రాబోతోంది. ఆ తేదీ , ప్లాట్ ఫామ్ వివరాలు
అల్లరి నరేష్ ఎన్నో ఆశలు ,నమ్మకాలు పెట్టుకుని చేసిన చిత్రం 'బచ్చలమల్లి' . ఈ చిత్రం ఓ ఊరమాస్ సినిమా అంటూ ఊరించారు. అంతకు ముందు చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' ఆశించిన విజయం సాధించకపోవడంతో మరోసారి మాస్ క్యారెక్టర్‌నే నమ్ముకున్నారు. ఇందులో నరేష్ లుక్, యాక్టింగ్ అదిరిపోయిందనే టాక్ వచ్చినా భాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో చాలా మంది సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యాక చూద్దాములే అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
read more: ఆకతాయి వేధింపులు.. హీరోయిన్ మీనా కోసం కెప్టెన్ విజయకాంత్ ఎంత రిస్క్ చేశాడో తెలుసా?
ఈ చిత్రంలో మల్లి పాత్రలో అల్లరి నరేష్ నటన అయితే అదిరింది. గడ్డం, జుట్టు పెంచుకుని ఊరమాస్ లుక్‌లో ఆయన కనిపించారు. ఇక టైటిల్ 'బచ్చలమల్లి'లో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్‌గా కనిపించాడు.
'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా చిత్రాన్ని నిర్మించారు. 'హనుమాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రం డిసెంబర్ 20 వ తేదీన థియేటర్స్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు జనవరి 9 నుంచి ఓటిటిలో ఈ సినిమా రాబోతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో పటుట్దల ఎంత అవసరమో... అవసరమైన సందర్భంలో ఓ అడుగు తగ్గాలి విడుపు కూడా ఉండాలి.
అప్పుడు జీవతం సాఫీగా సాగుతుంది. బంధం, అనుబంధం నిలవాలంటే కోపతాపాలు, ప్రతీకారాలు పక్కకు పెట్టి ముందడుగు వేయాలి.. లేదంటా చివరికి ఎవరూ లేకుండా సోలోగాలనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇది నిజజీవితంలో చూసిందే. బచ్చలమల్లి జీవితం కూడా అలాంటిదే అన్నది ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాపై నమ్మకంతో అల్లరి నరేష్ చాలా ఎగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేసారు. ఇందులో మూర్ఖత్వంతో కూడిన వ్యకిగా నరేష్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. నరేష్ కెరీర్‌లో పేరు తెచ్చిన పాత్రలు తీసుకుంటే అందులో బచ్చలమల్లి తప్పకుండా ఉంటుంది. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా నరేష్ పోషించిన మల్లి పాత్ర గుర్తుండిపోతుంది.
read more: బ్రాహ్మణికి స్టార్ డైరక్టర్ నుంచి సినిమా ఆఫర్..స్వయంగా చెప్పిన బాలయ్య
కథేంటి:
బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పటి నుంచీ తండ్రి అంటే చాలా ఇష్టం. తెలివైనవాడు. తండ్రి గర్వపడేలా పదో తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మల్లిని బాధిస్తుంది. దాంతో అతి చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతాడు.
కాలేజీ చదువు పక్కనపెట్టి తండ్రి చేసిన పనికి కోపంతో మొండితనం, మూర్ఖత్వం అలవరతాయి. ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన కావేరి (అమృత అయ్యర్)తో ప్రేమలో పడతాడు. మూర్ఖుడిగా ఉన్న మల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా లేదా? తండ్రితో వచ్చిన సమస్య ఏంటి? ప్రియురాలితో ప్రేమ సుఖాంతం అయిందా అన్నది తెరపైనే చూడాలి.