MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయోధ్యకు స్పెషల్ శారీలో ఆలియా భట్, చీర ప్రత్యేకత ఇదే..? కాస్ట్ ఎంతంటే..?

ఆయోధ్యకు స్పెషల్ శారీలో ఆలియా భట్, చీర ప్రత్యేకత ఇదే..? కాస్ట్ ఎంతంటే..?

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేకంగా మెరిశారు బాలీవుడ్ కపుల్ రణబీర్ కపూర్ - ఆలియా భట్. అయితే ఈ సందర్భంగా ట్రెడిషనల్ శారీలో మెరిసింది ఆలియా. అయితే ఈ చీర ప్రత్యకత ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 24 2024, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్  స్టార్ కపుల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రణ్‌బీర్ కపూర్-అలియా భట్. ఇద్దరు హీరో హీరోయిన్లు కావడంతో ఇండస్ట్రీని.. ఇటు ప్యామిలీ లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ.. కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఒకరికి ఒకరు వీరికి ఓ పాప. ముచ్చటగా ముగ్గరు  హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ బాలీవుడ్ కపుల్.  జంటగా శ్రీరామ కార్యంలో సందడి చేశాడు. ఇక ఈ సందర్భంగా అలియా భట్ ధరించిన చీర  ప్రస్తుతం వైరల్ న్యూస్ అవుతోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఎంతో అందంగా ఉన్న ఈ చీర చాలా  ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? ఈ చీర ఖరీదు ఏంత..? 

36

ఆలియా భట్ కట్టకున్న ఈ అందమైన సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేశారని తెలుస్తోంది. వారిచేత ప్రత్యేకంగా ఆలియా భట్ డిజైన్ చేయించిందట.  ఈ చీరను తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది. కాని వారు ఆలియా కోరిక మేరకు 10 రోజుల్లో డిజైన్ చేసారని తెలుస్తోంది. 

46

ఇది కర్నాటక మైసూర్ సిల్క్ చీర కాగా.. ఆ చీరపై  ఎంతో అందంగా.. రామాయణంలోని  ముఖ్యమైన ఘట్టాలను డిజైన్ చేసారు. రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడిని అడవికి వెళ్లమని అడగడం, గంగా నదిపై వంతెన, బంగారు జింక, సీతాపహరణ వంటి రామాయణ ఘట్టాల చిత్రాలు ఈ చీరపై డిజైన్ చేసారు. దాంతో ప్రస్తుతం ఈ చీర స్పెషల్ గా వార్తల్లోకి ఎక్కింది. నెట్టింట వైరల్ అవుతోంది. 
 

56

ఇక ఈ చీరను ఇద్దరు ఆర్టిస్టులు 10 రోజుల పాటు కష్టపడి తయారు చేశారట. చీరపై వర్క్ చేయడానికి వారు ఎంతో కష్టపడ్డారని అంటున్నారు. అయితే  ఈ చీర ఖరీదు విషయానికి వస్తే..దాదాపు 50,000 ఉంటుందని డిజైనర్ భారతి వెల్లడించారు. ప్రస్తుతం ఈ చీరలో ఆలియా లుక్స్ వైరల్ అవుతున్నాయి. 

66

రీసెంట్ గా  ఉత్తమన నటిగా జాతీయా అవార్డ్ అందుకుంది ఆలియా భట్. వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇక అటు రణబీర్ కపూర్ కూడా  యానిమల్ సినిమాలో బ్లాక్ బస్టర్ సాధించాడు, తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈమూవీ దాదాపు 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఓటీటీరిలీజ్ కు కూడా రెడీ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved