MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 2000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా ?

2000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా ?

“ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో " ఫినాలే ఎపిసోడ్‌లో, ఒక స్టార్ హీరో  తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) గురించి మాట్లాడారు. దాదాపు 2000 కోట్ల FD లు కలిగి ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 27 2025, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అక్షయ్ కుమార్
Image Credit : instagram

అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) 1987 నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.  ప్రతి సంవత్సరం అత్యధిక సినిమాలు చేస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. సినిమాకు 100 కోట్ల వరకూ అక్షయ్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అత్యధిక పన్ను చెల్లించే నటుడు
Image Credit : Social Media

అత్యధిక పన్ను చెల్లించే నటుడు

అక్షయ్ కుమార్  అత్యధిక పారితోషికం తీసుకోవడమే కాదు. చాలా ఏళ్లుగా 'భారత్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారు' (Highest tax payer) అనే పేరు కూడా సంపాదించారు. అంతే కాదు తను డబ్బును సంపాదించడమే కాదు, సమాజసేవలో కూడా ముందు ఉంటాడు అక్షయ్. రీసెంట్ గా తాను ఇప్పటి వరకూ  డబ్బును ఎలా పెంచుకున్నారో చెప్పారు.

37
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
Image Credit : Social Media

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

ఇటీవల, అక్షయ్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శో' (సీజన్ 3) ఫైనల్‌లో కనిపించారు. అక్కడ అతని 35 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా, ఆర్థిక భద్రతకు ఎవరు ప్రేరణ ఇచ్చారో, డబ్బు ఆస్తులు ఎలా పెంచారో వివరించారు. అక్షయ్ కుమార్ ఆర్ధికంగా ఎంత స్ట్రాంగా ఉంటాడో, అంత జాగ్రత్తగా కూడా ఉంటాడు. 

47
జితేంద్ర ప్రేరణ
Image Credit : instagram

జితేంద్ర ప్రేరణ

డబ్బు గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ "చాలా కాలం క్రితం జితేంద్ర గారు 100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేశారని ఒక పత్రికలో చదివాను. అప్పుడు మా నాన్న దగ్గరికి పరుగెత్తుకెళ్లి, 'నాన్న, ఎవరైనా 100 కోట్ల FD చేస్తే, ఎంత వడ్డీ వస్తుంది?' అని అడిగాను."

57
100 కోట్ల FDకి 13% వడ్డీ రేటు
Image Credit : @akshay kumar

100 కోట్ల FDకి 13% వడ్డీ రేటు

ఆ సమయంలో వడ్డీ రేటు 13% ఉండేది, అంటే నెలకు 1.3 కోట్లు. 'నేను అలాంటి FD చేసిన రోజు, ఆర్థికంగా సురక్షితంగా ఉంటానని అప్పుడే అనుకున్నాను. దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాను'.

67
2,000 కోట్లకు FD
Image Credit : instagram

2,000 కోట్లకు FD

కానీ ఎంత డబ్బు ఉన్నా మనిషికి తృప్తి ఉండదు. ఆ సంఖ్య నాకు పెరుగుతూనే ఉంది . 100 కోట్ల నుంచి 1,000 కోట్లకు, ఆ తర్వాత 2,000 కోట్లకు FD చేశాను. ఈ అత్యాశకు అంతం ఉండదని అక్షయ్ అన్నారు.

77
మిడిల్ క్లాస్ ఆలోచన
Image Credit : Social Media

మిడిల్ క్లాస్ ఆలోచన

ఈ టైంలో కపిల్, మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఆలోచనలు వదిలారా? లేదా? అని అడగ్గా, అక్షయ్ నవ్వుతూ, "ఈ రోజు కూడా, నా కొడుకు లేదా కూతురు ఫ్యాన్ లేదా లైట్ వేస్తే, నేను వెంటనే వెళ్లి ఆపేస్తాను. అది నా అలవాటు. నేను పిసినారిని కాదు, కానీ పెరిగిన విధానం అలాంటిది." అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన ప్రియాంక చోప్రా , ఫస్ట్ కిస్ ఎవరి వల్ల మిస్ అయ్యిందంటే?
Recommended image2
8 సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న రష్మిక మందన్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved