హీరోయిన్లతో వల్గర్ గా నటించొద్దు అని చెప్పిన ఏఎన్నార్.. తండ్రిని నాగార్జున తిరిగి ఏమని ప్రశ్నించాడో తెలుసా
అక్కినేని వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ నటిస్తున్నప్పుడు గ్లామర్, అశ్లీలత చాలా తక్కువ. కాల క్రమంలో గ్లామర్, అశ్లీలత రెండూ సినిమాలో భాగం అయ్యాయి. గ్లామర్ అనేది కమర్షియల్ అంశంగా మారిపోయింది.
అక్కినేని వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ నటిస్తున్నప్పుడు గ్లామర్, అశ్లీలత చాలా తక్కువ. కాల క్రమంలో గ్లామర్, అశ్లీలత రెండూ సినిమాలో భాగం అయ్యాయి. గ్లామర్ అనేది కమర్షియల్ అంశంగా మారిపోయింది. లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏఎన్నార్ మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు చిత్ర పరిశ్రమ దిగజారింది. అందులో సందేహం లేదు. కాలంలో వచ్చిన మార్పు కాబట్టి ఎవ్వరూ ఏమి చేయలేరు. హీరోయిన్ల బట్టలు దారుణంగా తయారయ్యని అని ఏఎన్నార్ అన్నారు. ఇది తప్పు అని ఎవ్వరూ ఎవరి దగ్గరకి వెళ్లి చెప్పలేరు. ఎవరైనా అడిగితే మాత్రం బాగాలేదు అని నా అభిప్రాయం చెబుతాను.
కానీ నన్ను నా కుటుంబ సభ్యులే అడగరు. నా కుటుంబ సభ్యులు చేసిన చిత్రాల్లోనే కొన్ని నాకు నచ్చవు. నాగార్జునతో ఒకసారి చెప్పాను. హీరోయిన్లతో డ్యాన్స్ మూమెంట్స్, కొన్ని సన్నివేశాలు వల్గర్ గా ఉంటున్నాయి. కొంచెం చూసుకో అని చెప్పా. దీనికి నాగార్జున ఇచ్చిన సమాధానం.. నాన్న మీరు వేరే హీరోల సినిమాలు చూడడం లేదా అని ప్రశ్నించాడు. ఇతర హీరోలు నా కంటే ఎక్కువగా చేస్తున్నారు. పోటీ పెరిగిపోయింది.
పోటీ తట్టుకోవాలంటే వాళ్లంత కాకపోయిన నేను కూడా కొంచెం అలాంటి డ్యాన్సులు చేయాల్సి వస్తోంది. చేయకపోతే వెనుకబడిపోతాను. అది కూడా మీకు బాధే కదా అని అడిగాడు. నాగార్జున చెప్పిన సమాధానం, అతని అభిప్రాయం నాకు కరెక్టే కదా అనిపించింది. కాలంలో వచ్చిన మార్పుని అతను మాత్రం ఏం చేస్తాడు అని అనుకుని సలహాలు ఇవ్వడం మానేసినట్లు ఏఎన్నార్ తెలిపారు.
నాగార్జున టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. మాస్ ఆడియన్స్ ని కూడా అలరించారు. నాగార్జున టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు అగ్ర హీరోగా రాణించారు. ప్రస్తుతం నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు.