MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున - అఖిల్ మల్టీస్టారర్ గా భారీ ప్రాజెక్ట్.. ‘మెగా’ డైరెక్టర్ తో ఫిక్స్.!

నాగార్జున - అఖిల్ మల్టీస్టారర్ గా భారీ ప్రాజెక్ట్.. ‘మెగా’ డైరెక్టర్ తో ఫిక్స్.!

అక్కినేని హీరోలు వరుస చిత్రాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. మరోవైపు అక్కినేని హీరోల మల్టీస్టారర్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ క్రమంలో మెగా డైరెక్టర్ తో తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయ్యింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 01 2022, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అక్కినేని హీరోలు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్  విభిన్న కథలతో ప్రేక్షకులను తమవైపు తిప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో అక్కినేని హీరోల మల్టీస్టారర్ చిత్రాలు విజయవంతంగా నిలిచిన విషయం తెలిసిందే. 
 

26

‘మనం’ చిత్రంతో అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్య ఒకే ఫ్రేమ్ లో అభిమానులను అలరించారు. ఏడెనిమిదేండ్ల కింద వచ్చిన ఈ అక్కినేని ఫ్యామిలీ చిత్రం  మంచి విజయాన్ని సాధించింది. నాగార్జున (Nagarjuna) - నాగచైతన్య (Naga Chaitanya) మల్టీస్టారర్ గా ఇటీవల వచ్చిన ‘బంగార్రాజు’ కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.
 

36

దీంతో అక్కినేని హీరోల మల్టీస్టారర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జున - అఖిల్ (Akhil) కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. నాగార్జున - అఖిల్ కాంబినేషన్ ఒకే అయినట్టు తెలుస్తోంది. 
 

46

భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (Godfather)కు దర్వకత్వం వహించిన మోహన్ రాజా (Mohan Raja)నే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. 

56

ఇప్పటికే మోహన్ రాజా అక్కినేని హీరోలకు చెప్పిన లైన్ నచ్చిందని, దర్శకుడిగా మోహన్ రాజా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో మోహన్ రాజా నెక్ట్స్ ప్రాజెక్ట్ అక్కినేని వారితోనేనని అర్థమవుతోంది. నాలుగురోజుల్లో గాడ్ ఫాదర్ రిలీజ్ ఉండగా.. సినిమా ఫలితం, తదితర కార్యక్రమాల అనంతరం ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. 
 

66

మరోవైపు నాగార్జున - అఖిల్ సినిమా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ దసరా పండుగా సందర్భంగానే కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్ట్ ను మొదలు పెట్టాలని కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’(The Ghost) రిలీజ్ కాబోతోంది. అటు అఖిల్ ‘ఏజెంట్’ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
స్టార్ హీరో డెబ్యూ టైంకి ఇంకా పుట్టని హీరోయిన్లు..ఇప్పుడు వాళ్ళతోనే రొమాన్స్, ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!
Recommended image2
Sudheer-Vishnu Priya: సుడిగాలి సుధీర్‌కి విష్ణుప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌, స్టార్‌ కమెడియన్‌ రియాక్షన్‌ ఇదే
Recommended image3
చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ అందరికీ భారీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్..రెమ్యునరేషన్ లేదు, వందల కోట్ల ఎక్కడివి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved