కింగ్ నాగార్జునకు అక్కినేని అభిమానుల వార్నింగ్, బిగ్ బాస్ ను వదిలేయాలంటూ...?
అక్కినేని ఫ్యాన్స్ విసిగిపోయారట... వారికి తెగ కోపంవచ్చేసిందట. ఇక తట్టుకోలేక కింగ్ నాగార్జునకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ వారి కోపానికి గల కారణం ఏమిటి..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకి ఆయన అభిమానుల నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వస్తోందట. ఎందుకు ఇలాంటి పని చేయడం. మంచి మంచి సినిమాలు చేసి. అభిమానులను అలరించవచ్చు కదా..? అనవసరంగా ఒకరితో మాట పడటం ఎందుకు అంటూ నాగార్జునను నిలదీస్తున్నారట అభిమానులు.ఇక వారు దేని గురించి అంటున్నారో ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది కదా..?
బిగ్ బాస్ రియాల్టీ షో విషయం గురించి ఆయనపై గుర్రుగా ఉన్నారట ఫ్యాన్స్. పేరుకే అది రియాల్టీ షో.. అందులో లేనిదే రియాల్టీ.. అంటున్నారు కింగ్ అక్కినేని నాగార్జున అభిమానులు. అంతే కాదు ఈసారి నాగార్జున హోస్టింగ్ కూడా పేలవంగా ఉండటంతో.. విమర్షలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మీకు అసవరమా.? అందరితో మాటలు పడటం అంటూ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
Nagarjuna
బిగ్ బాస్ సీజన్ 6 చాలా చప్పగా సాగుతోంది. ఈసారి నాగార్జున హోస్టింగ్ పై కూడా వరుసగా విమర్షలు వస్తున్నాయి. ఫస్ట్ సీజన్ ను ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా నడిపించారు. కంటెస్టెంట్స్ ను బాగా కంట్రోల్ లో పెట్టారు. ఇక సెకండ్ సీజన్ లో నానీ హోస్ట్ గా పూర్తిగా విఫలం అయ్యారు. ఇక మూడో సీజన్ నుంచి ఇప్పటి ఆరో సీజన్ వరకూ కింగ్ నాగార్జున వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ సీజన్ కు అనుకున్నంత గా చూపించలేకపోతున్నారట.
కింగ్ హోస్టింగ్ చేసిన మూడు, నాలుగు సీజన్లలో నాగార్జునన విమర్షించే దైర్యం ఎవరూ చేయలేక పోయారు. ఇక 5వ సీజన్ లో కాస్తి మెత్త బడ్డ నాగ్.. సీజన్ సిక్స్ కు వచ్చే వరకూ ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారట. ఇదంతా ఎందుకు .. ఈ టైమ్ ను సినిమాలకు కేటాయించవచ్చు కదా అని గట్టిగానే నిలదీస్తున్నారట ఫ్యాన్స్.
ఇక చాలు.. ఆపేస్తే మంచిది.. ఈ దండగమారి బిగ్ బాస్ ఎందుకు.? అంటూ అక్కినేని నాగార్జునని కడిగి పారేస్తున్నారట. అదీ ఆయన అభిమానులే అలా అంటుండటంతో.. నాగార్జున కూడా ఆలోచనలో్ పడ్డట్టు తెలుస్తోంది.
ఏ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో ముందే బిగ్ బాస్ వ్యూయర్స్‌కి తెలిసిపోతోంది. కెప్టెన్సీ దగ్గర్నుంచి, వీకండ్ ఎలిమినేషన్ వరకూ అన్నీ ముందే తెలిసిపోతున్నా.. అేదదో టాప్ సీక్రెట్ అన్నట్లు బిగ్ బాస్ టీమ్ వ్యవహరిస్తుండడంతో షో స్థాయి నానాటికీ దిగజారిపోతోంది. ఇప్పటికే డామేజ్ కంట్రోల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్.