MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై కొడుకు అకీరా నందన్‌ ఏమన్నాడో తెలుసా?.. వామ్మో పవన్‌ పిల్లలు ఇలా ఉన్నారా?

రేణు దేశాయ్‌ రెండో పెళ్లిపై కొడుకు అకీరా నందన్‌ ఏమన్నాడో తెలుసా?.. వామ్మో పవన్‌ పిల్లలు ఇలా ఉన్నారా?

నటి రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాను కూడా మళ్లీ ఫ్యామిలీ లైఫ్‌ స్టార్ట్ చేయాలనుకున్నారు. దీనిపై అకీరా నందన్‌ కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 22 2024, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల సహజీవనం, నాలుగేళ్ల మ్యారేజ్‌ లైఫ్‌ అనంతరం ఆమెకి విడాకులు ఇచ్చారు పవన్‌. రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక పవన్‌ నుంచి విడిపోయిన రేణు దేశాయ్‌ ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఆమెకి ఇద్దరు పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలు ఉన్నారు. వారి బాగోగులు చూసుకుంటుంది. పిల్లలకే పరిమితమయ్యింది. 

Poll: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అయితే ఒకానొక దశలో రేణు దేశాయ్‌ కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యింది. సంబంధాలు కూడా చూశారు. ఒకరిద్దరితో చర్చలు కూడా జరిగాయి. రేణు దేశాయ్‌ కూడా మాట్లాడింది. మ్యారేజ్‌ చేసుకోవాలనే ఫిక్స్ అయ్యింది. తనకు వచ్చే వాడు ఎలా ఉంటాడో అనే కలలు కూడా కనింది. కానీ ఇంకా మ్యారేజ్‌ కాలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు వదిలేసుకున్నట్టు తెలుస్తుంది.
 

37

రేణు దేశాయ్‌ మామూలు అమ్మాయి కాదు, ఆమె ఒక నటి. సెలబ్రిటీ. పైగా పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అనే ట్యాగ్‌ ఆమెని ఇప్పటికీ వెంటాడుతుంది. ఇవన్నీ పెద్ద బ్యాగేజ్‌ల, బరువులా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని, ఆ బరువుని తీసుకునే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. చాలా మెచ్యూర్డ్ పర్సన్‌ అయితేగానీ అది సాధ్యం కాదు. పైగా పిల్లలు ఉన్నారు. వారి విషయంలోనూ అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరక్కపోవడంతో ఇక లైట్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. 
 

47

ఇదిలా ఉంటే ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను పంచుకుంది రేణు దేశాయ్‌. తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే కొందరు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు బెదిరించారట. చంపేస్తామనే బెదిరింపు పోస్ట్ లు పెట్టారట. దీనిపై ఆమె మండి పడింది. పవన్‌ కళ్యాణ్‌ మరో పెట్టి చేసుకున్నప్పుడు ప్రశ్నించని వాళ్లు తన విషయంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు వాటిని పట్టించుకోనని వెల్లడించింది. 
 

57

ఇక తాను కూడా మ్యారేజ్‌ చేసుకోవాలని ఎంతగానో అనుకుందట. తమ ఫ్యామిలీ వాళ్లు కొన్ని సంబంధాలు కూడా చూశారట. ఇద్దరిది దగ్గరగా వచ్చిందని, ఒకరితో మాట్లాడానని, కానీ అది వర్కౌట్‌ కాలేదని తెలిపింది. తనకు ఎలాంటి వాడు వస్తాడో అని కలలు కన్న రోజులు కూడా ఉన్నాయని తెలిపింది రేణు దేశాయ్‌. ఆ విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నట్టు తెలిపింది. 
 

67

ఓ సందర్భంలో పిల్లలే అన్నారట. పవన్‌ మరో పెళ్లి చేసుకున్నప్పుడు. మమ్మీ నువ్వెందుకు సింగిల్‌గానే ఉంటున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అకీరా నందన్‌ అడిగాడట. దానికి రేణు స్పందిస్తూ, చేసుకుంటా బాబు, అబ్బాయి దొరకాలి కదా అని చెప్పింది. అయితే పవన్‌, తాను విడిపోయిన విషయం పవన్‌తో వాళ్లు ఎప్పుడూ అడగరట. అకీరా, ఆద్య చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు, చిన్నపిల్లల్లా అనిపించరు. 

77
Akira Nandan

Akira Nandan

ఇక తాను పెళ్లిచేసుకుంటే గర్వంగా దాన్ని ప్రకటిస్తానని, అధికారికంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది రేణు దేశాయ్‌. అలాంటి మూమెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇది ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో తెలిపింది. ఇది చాలా ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. కెరీర్‌పై మళ్లీ ఫోకస్‌ పెట్టింది. ఆ మధ్య `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. బలమైన పాత్రలు వస్తే నటిగా కొనసాగేందుకు సిద్ధంగానే ఉంది రేణు దేశాయ్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image2
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image3
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved