- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానాంబ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. నెల తప్పిన అఖిల్ ప్రియురాలు జెస్సి!
Janaki Kalaganaledu: జ్ఞానాంబ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. నెల తప్పిన అఖిల్ ప్రియురాలు జెస్సి!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి రామలు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జానకి, మనం అత్తయ్య గారి మాటలు నిలబెట్టాలంటే ఇలా మనం మాటలతో కాలాన్ని గడిపేయకూడదు గాలి కూడా మన మధ్య దూరడానికి వీలు లేదు అని అంటుంది. అప్పుడు రామా అమాయకంగా ఏం చేయాలండి ఇప్పుడు అని అడుగుతారు అలా వాళ్ళిద్దరూ కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మల్లికా విష్ణు ఇద్దరు పడుకుంటారు. అప్పుడు విష్ణు లేచి మల్లిక ని లేపి ఈరోజు పండగ త్వరగా లెగు లేకపోతే అమ్మ నీ తాటతీస్తుంది అని అంటాడు.
అంతలో జానకి ఇల్లంతా నీట్ గా డెకరేట్ చేసి పువ్వులతో, కృష్ణుడు పాదపు అడుగులతో, పండగ వాతావరణం తెప్పిస్తుంది. అంతలో రామ అక్కడికి వస్తాడు అప్పుడు తెలియకుండా ఆ పాదపు అడుగుల్లో పువ్వుల్ని మట్టేస్తాడు. అప్పుడు క్షమించండి జానకి గారు చూసుకోలేదు అని అనగా మీరు నాకు చిన్న కృష్ణుడు మీరెందుకు నన్ను క్షమించమని అడగడం మీరు ఎంత పెద్ద వారైనా మనసులో చిన్న కృష్ణుడే అని అంటాది. ఈ మాటలని జ్ఞానాంబ, గోవిందరాజు విని మన జానకికి రామ అంటే ఎంత ప్రేమ అని అనుకుంటారు. ఇంతలో మల్లిక వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఇంత ఉదయాన్నే ఇంత రొమాంటిక్ సీన్ జరుగుతుంది అలాంటి అప్పుడు విల్లన్ నీ, నేను ఏదో ఒకటి చేయాలి కదా అని మనసులో అనుకోని మీ ఇద్దరి ప్రేమ లోకంలో మునిగిపోయి పక్కనున్న మనుషులని పట్టించుకోవడం లేదేంటి అని ఎటకారుస్తూ ఉంటుంది.
ఇంతట్లో అఖిల్ వచ్చి మీరు ప్రేమ పక్షుల లాగా ఉన్నారు. పెళ్లయిన తర్వాత కూడా ప్రేమికుల లాగా ఉన్నారు అని అంటాడు. ఇంతట్లో చికిత వచ్చి ఎక్కడో కుల్లుకుంటున్న వాసన తగులుతుంది పెద్దయ్య గారు అని మల్లిక ని ఏటకారిస్తుంది.ఆ తర్వాత సీన్లో జెస్సీ మంచం మీద పడుకొని ఉంటుంది అప్పుడు డాక్టర్ వచ్చి జెసికి ఏమైందో చూస్తుంది. ఇంతలో బయట జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు జెస్సి కి ఏమైంది అని బాధపడుతూ ఉంటారు. ఏమి అవ్వదు జీసస్ మనకు తోడుగా ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఇంతలో డాక్టర్ కోపంగా బయటకు వచ్చి మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ముగ్గురు ఆశ్చర్యపోతారు.
జస్సీ వాళ్ళ అమ్మ,జెస్సిని కొట్టి ఇంత దారుణమైన పని చేశావు. మన కుటుంబ పరువును తీస్తున్నావు కదా అని కొడుతుంది.అప్పుడు జెస్సి వాళ్ళ నాన్న,జెస్సి దగ్గరికి వెళ్లి మేము నీకు ఏమీ లోటు చేయకుండా పెంచాము అయినా సరే ఇంత తప్పు చేశావు,ఎవడాడు మర్యాదగా చెప్పు అని అడుగుతాడు జెస్సి మౌనంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, ఇప్పటివరకు నాలో ఉన్న మంచితనాన్ని చూసావు ఇంకో కోణం కూడా బయటకు వస్తుంది మర్యాదగా చెప్పు అని అనగా అఖిల్ పేరు ఇప్పుడే చెప్తే బాగోదు, అఖిల్ ని అడిగి, మాట్లాడి చెప్డాము అని మనసులో అనుకుంటుంది జెస్సి. అప్పుడు జెస్సి వాళ్ళ డాడీ నేను నీకు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను వాడు ఎవడో చెప్పకపోతే కథ ఇంకోలా ఉంటుంది అని జెస్సికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
జెస్సి అక్కడ అలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానంభ కుటుంబం అంతా కృష్ణాష్టమిని ఆనందంగా జరుపుకుంటారు అప్పుడు ఇంత ఘనంగా ఎందుకు చేస్తున్నావు జ్ఞానాంబ అని చుట్టుపక్కల వాళ్లు అడగగా, మా కోడలు గర్భవతి అయిన తర్వాత జరిగే మొదటి పండుగ కదా ఈమాత్రమైన చేయాలి అని అంటుంది జ్ఞానం ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని కూడా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు నాకోసం పండగ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది అని మల్లిక అనుకుంటుంది. ఇంతలో అక్కడ అందరూ కోలాటం ఆడుతూ ఉంటారు నేను కూడా ఆడతా అత్తయ్య అనగా నువ్వు కడుపుతో ఉన్నావు ఇప్పుడు వద్దు అని అంటుంది ఙ్ఞానాంబ. ఇంతటిలో జానకి వాళ్ళందరూ కృష్ణుడి చుట్టూ కోలాటం ఆడతారు. అప్పుడు మల్లికా, తిండిబోతుని ఎదురుకుంటా పెట్టి చేతులు కట్టేసి పంచపక్ష పరమన్నలు తింటున్నట్టు నా ముందే వీళ్ళు డాన్స్ లు ఇస్తున్నారా? నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!