Akhil Akkineni: నాకు మెంటల్ ఎక్కింది.. ఫ్యాన్స్ ముందు గుండెలు బాదుకున్న అఖిల్
అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ ని మలుపు తిప్పే మంచి యాక్షన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. బహుశా ఆ చిత్రం 'ఏజెంట్' మూవీనే కావచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ ని మలుపు తిప్పే మంచి యాక్షన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. బహుశా ఆ చిత్రం 'ఏజెంట్' మూవీనే కావచ్చు. అఖిల్ నటించిన తొలి మూవీ 'అఖిల్' కూడా యాక్షన్ మూవీనే. కానీ అది డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా నిరాశ పరిచాయి.
గత ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ అది సరిపోదు. మాస్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి ఒక సాలిడ్ మూవీ.. దానిని డైరెక్ట్ చేసే నిఖార్సైన దర్శకుడు కావాలి. ఆ రకంగా 'ఏజెంట్' చిత్రానికి అన్నీ కుదిరాయి అనే చెప్పొచ్చు.
కొద్దిసేపటి క్రితం విడుదలైన ఏజెంట్ టీజర్ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. మునుపెన్నడూ చూడని స్టైలిష్ యాక్షన్ మూవీలా టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. అఖిల్ ని కంప్లీట్ గా మార్చేశాడు. చాకోలెట్ బాయ్ లాగా కనిపించే అఖిల్ ని పవర్ ఫుల్ మాస్ హీరోలా ప్రజెంట్ చేస్తున్నాడు.
టీజర్ తోనే సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచేశారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్ ప్రసంగం వైరల్ గా మారింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో.. అఖిల్ మాట్లాడుతూ.. నాకు క్రాక్ వచ్చేసింది.. మెంటల్ ఎక్కిపోయింది. మీ ఎనెర్జీ వల్ల నాలో నిప్పు అంటుకుంది అంటూ ఫాన్స్ ముందు గుండెలు బాదుకున్నాడు.
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మాట్లాడడానికి రాలేదు అని.. అక్కడ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. తప్పకుండా బ్లాక్ బస్టర్ అందిస్తాం అని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.
అఖిల్ అండ్ టీం కాన్ఫిడెన్స్ చూస్తుంటే ;ఏజెంట్' మూవీ తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా డెబ్యూ హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.