- Home
- Entertainment
- Pragya Jaiswal Latest Photos : సద్గురును కలిసిన ‘అఖండ’ హీరోయిన్.. ట్రెడిషినల్ లుక్ లో లేటెస్ట్ పిక్స్..
Pragya Jaiswal Latest Photos : సద్గురును కలిసిన ‘అఖండ’ హీరోయిన్.. ట్రెడిషినల్ లుక్ లో లేటెస్ట్ పిక్స్..
బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగదీష్ వాసుదేవ్ ను కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకున్న ప్రాగ్యా ఎంతో సంతోష పడుతోంది. తాజాగా ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

దర్శకుడు క్రిష్ తెరచెక్కించిన ‘కంచె’ మూవీతో పాపులారిటీని దక్కించకున్నారు హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal). మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ప్రాగ్యా కూడా ఐడెంటిటిని పొందింది.
అప్పటి నుంచి తెలుగులో వరుస చిత్రాలు చేస్తోంది. కంచె మూవీ కంటే ముందు కూడా ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మూవీలో నటించింది. కానీ చిత్రం విజయవంతం కాకపోవడంతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కంచె విజయంతో ప్రాగ్యాకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది.
ఆ తర్వాత మరికొన్ని తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. గత ఐదారేండ్లుగా ప్రాగ్యాకు ఒక్క హిట్టు కూడా లేదు. దీంతో నందమూరి నటసింహం బాలక్రిష్ణ సరసన ‘అఖండ’మూవీలో నటించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ప్రాగ్యా కేరీర్ లో రెండో హిట్ పడింది. ఒక మళ్లీ తన హవాను కొనసాగిస్తోంది.
అటు హిందీలోనూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2104లోనే ‘టిటూ ఎంబీఏ’ చిత్రంతో నార్త్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రాగ్యా.. ఇటీవల సల్మాన్ ఖాన్ తో ‘మే చలా’ మ్యూజిక్ వీడియో సాంగ్ లో నటించింది. అఖండ హిట్ తర్వాత.. ఈ సాంగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ జోష్ లో మున్ముందు బాలీవుడ్ లోనే సెటిలైన అవ్వొచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా, ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా ప్రాగ్యా జైస్వాల్ తన స్నేహితురాలితో కలిసి తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఆదియోగి స్టాచ్యూను సందర్శించారు. ఆ మహా పర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు (Sadhguru) జగదీశ్ వాసుదేవ్ కూడా అక్కడి రావడంతో ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంది.
ఫొటోలు షేర్ చేస్తూ సద్గురును కలవపడం పట్ల ఆమె అనూభూతిని తెలియజేసింది. ‘సద్గురుతో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. నిజంగా ఇదొక అపురూపమైన అనుభవం. సాయంత్రపు శక్తివంతమైన ధ్యానాలు, ఆదియోగి (శివుడికి) చేసిన ప్రార్థనలు, అసాధారణమైన ప్రదర్శనలు, ఆనందకరమైన గానాలు నన్ను ఆకర్షించాయి. ముఖ్యం అక్కడి నృత్యం ఆరోజును మరింత గుర్తుండిపోయేలా చేసింది.
కోయంబత్తూరులోని ఈషా సెంటర్‌లో నా చిన్న పర్యటన చాలా సంతోషంగా జరిగింది. అక్కడ నేను కలిసిన, సంభాషించిన, చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఆప్యాయత, కనికరాన్ని నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లాలని అనిపిస్తోంది. ముఖ్యంగా సద్గురుని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆయన ఆశీస్సులు పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.