- Home
- Entertainment
- హెవీ వర్కౌట్స్ తో చెమటలు కక్కిస్తున్న ‘అఖండ’ బ్యూటీ.. బ్లాక్ జిమ్ వేర్ జిగేలుమంటున్న ప్రాగ్యా జైస్వాల్ గ్లామర్
హెవీ వర్కౌట్స్ తో చెమటలు కక్కిస్తున్న ‘అఖండ’ బ్యూటీ.. బ్లాక్ జిమ్ వేర్ జిగేలుమంటున్న ప్రాగ్యా జైస్వాల్ గ్లామర్
‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) గ్లామర్, ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ నాజుగ్గా కనిపించేందుకు ఈ సుందరి జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన జిమ్ సెషన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ప్రాగ్యా జైస్వాల్ ఒకరు. పూణెకు చెందిన ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
గతేడాది నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన ‘అఖండ’(Akhanda) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రాగ్యా జైస్వాల్ చక్కగా నటించింది. తన పాత్రకు న్యాయం చేయడంతో పాటు బాలయ్యకు ధీటుగా అదిరిపోయే స్టెప్పులేసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ప్రస్తుతం ప్రాగ్యా జైస్వాల్ కేరీర్ సేఫ్ జోన్ లోనే ఉంది. ఇలాగే మరోహిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ఎదురుచూస్తోందీ బ్యూటీ. ఇందుకు జీరో సైజ్ బాడీని బిల్డప్ చేస్తోంది. ఫిజికల్ ఫిట్ నెస్ కోసం జిమ్ లో గంటలు తరబడి వర్కౌట్స్ చేస్తూ ఫ్యాట్ ను కరగదీస్తోంది. ఈ మేరకు వర్కౌట్ వీడియోను తన అభిమానులతో పంచుకుందీ బ్యూటీ.
ఈ వీడియోలో ప్రాగ్యా బ్లాక్ జిమ్ వేర్ లో అదుర్స్ అనిపిస్తోంది. ఓవైపు హెవీ వర్కౌట్స్ చేస్తూనే మరోవైపు కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు గ్లామర్ నూ ఒళకబోసింది. చిన్న నిక్కరు, బ్రా ధరించి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ.. చెమటలు కక్కిస్తోంది. నాజుగ్గా తయారయ్యేందుకు జిమ్ కు చాలా సమయం కేటాయిస్తోంది.
అయితే, ఫిట్ నెస్ కోసం ప్రాగ్యా ఇంతలా కష్టపడటం చూసిన పలువురు నెటిజన్లు ‘గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లైక్ లతో ఎంకరేజ్ చేస్తున్నారు.ప్రాగ్యా తన వర్కౌట్ వీడియోను షేర్ చేసుకుంటూ అదిరిపోయే క్యాప్షన్ యాడ్ చేసింది. ‘ఈరోజు నొప్పి, రేపు బలంగా ఉంటుంది’ అంటూ చాలా మోటివేటివ్ గా క్యాప్షన్ ఇచ్చింది.
‘అఖండ’ చిత్రం తర్వాత ప్రాగ్యా డైలాగ్ కింగ్ మోహన్ బాబు సరసన ‘సన్ ఆఫ్ ఇండియా’లో నటిచింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి ‘మై ఛలా’ మ్యూజిక్ వీడియోలోనూ మెరిసింది. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఎలాంటి అప్డేట్ మాత్రం లేదు.