MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఐశ్వర్యారాయ్ ఫోటోలు, వీడియోలు అలా వాడుతున్నారా..! : ఆపమని కోర్టును ఆశ్రయించిన నటి

ఐశ్వర్యారాయ్ ఫోటోలు, వీడియోలు అలా వాడుతున్నారా..! : ఆపమని కోర్టును ఆశ్రయించిన నటి

తన ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఎవ్వరూ వాడకుండా చూడాలంటూ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల వీడియోలు సర్క్యులేట్ కాకుండా చూడాలని కోరుతున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 09 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐశ్వర్యారాయ్ మార్ఫింగ్, ఏఐ ఫోటోలు, వీడియోలు
Image Credit : Aishwarya Rai Bachan Instagram

ఐశ్వర్యారాయ్ మార్ఫింగ్, ఏఐ ఫోటోలు, వీడియోలు

Aishwarya Rai : ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ బిడ్డకు తల్లి అయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు... దీంతో యువత ఇప్పటికీ ఐశ్వర్యారాయ్ ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఆమెపై యువత చూపించే అభిమానాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఐశ్వర్యారాయ్ సాధారణ ఫోటోలనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),డీప్ ఫేక్ వంటి టెక్నాలజీని ఉపయోగించి అశ్లీల ఫోటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. ఇటీవలకాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తన ఫోటోలు, వీడియోలపై కోర్టుకు ఐశ్వర్యారాయ్
Image Credit : Aishwarya Rai Bachchan Instagram

తన ఫోటోలు, వీడియోలపై కోర్టుకు ఐశ్వర్యారాయ్

 అయితే తనకు సంబంధంలేని అశ్లీల మార్ఫింగ్ వీడియో, ఏఐ ఫోటోలతో విసిగిపోయిన ఐశ్వర్యారాయ్ ఏకంగా కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వీడియోలు ఉపయోగించుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని డిల్లీ హైకోర్టును కోరారు. ఈమె పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఫోటోలు, వీడియోలు వాడకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా జస్టిస్ తేజస్ కరియా నిర్ణయంతో ఐశ్వర్యారాయ్ కి కాస్త ఊరట లభించింది.

35
ఐశ్వర్యారాయ్ పేరుతో అశ్లీల మార్పింగ్ వీడియోలు
Image Credit : Aishwarya Rai Bachchan Instagram

ఐశ్వర్యారాయ్ పేరుతో అశ్లీల మార్పింగ్ వీడియోలు

ఐశ్వర్యారాయ్ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల వ్యవహారంపై న్యాయవాది సందీప్ సేథి కోర్టులో వాదించారు. ఆమె చిత్రాలనే కాదు పోలికలను కూడా ఉపయోగించుకునేందుకు ఎవరికీ హక్కు ఉండదని న్యాయవాది పేర్కొన్నారు. చివరికి కొందరు ఐశ్వర్యారాయ్ పేరును,  మార్ఫింగ్ ఫోటోలను, ఆమెను పోలివున్న వీడియోలను లైంగిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని… ఇది అతి దారుణమని న్యాయవాది సేథ్ పేర్కొన్నారు.

45
తన పరువుకు నష్టం కలిగిస్తున్నారు..: ఐశ్వర్యారాయ్
Image Credit : Aishwarya Rai Bachchan Instagram

తన పరువుకు నష్టం కలిగిస్తున్నారు..: ఐశ్వర్యారాయ్

తన పరువును, ప్రైవసీకి భంగం కలిగించే ఫోటోలు, వీడియోలను ఐశ్వర్యారాయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు, ఫోటోలు వాడుతున్నవారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇకపై వీటిని వాడకుండా చూడాలని ఐశ్వర్యారాయ్ కోరుతున్నారు. మరీముఖ్యంగా అశ్లీల ఏఐ ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె అభ్యర్థనపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

55
డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్
Image Credit : Getty

డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్ తరపున అడ్వోకేట్స్ ప్రవీణ్ ఆనంద్, ద్రువ్ ఆనంద్ వాదనలు వినిపించారు. డిల్లీ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది 2026, జనవరి 15 కు వాయిదా వేసింది. అప్పటివరకు ఐశ్వర్యారాయ్ ఫోటోలను అభ్యంతకరంగా వాడకుండా ఆదేశాలు జారీ చేయనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బాలీవుడ్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Related Stories
Recommended image1
ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యను ప్రతీ ఏడాది కాన్స్ కి ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved