MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aishwarya Lekshmi: 100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా అకౌంట్ తెరవను.. సాయిధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌ స్టేట్‌మెంట్‌

Aishwarya Lekshmi: 100 కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా అకౌంట్ తెరవను.. సాయిధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌ స్టేట్‌మెంట్‌

Aishwarya Lekshmi: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టి లక్షలు సంపాదించే నటీనటులున్న ఈ రోజుల్లో, 100 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయనని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది సాయిధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2026, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గాడ్సేతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి
Image Credit : instagram

గాడ్సేతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి

గాడ్సే, కుమారి, అమ్ము చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మి. ఇప్పుడు ఆమె సాయిధరమ్‌ మూవీలో నటిస్తుంది. `సంబరాల ఏటి గట్టు` మూవీలో నటిస్తున్న ఐశ్వర్య `గట్ట కుస్తీ 2` చిత్రంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునేందుకు రాబోతుంది.  సోషల్ మీడియాలోని నెగటివిటీ తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆమె  ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్‌ మీడియా నుంచి ఐశ్వర్య ఎగ్జిట్‌
Image Credit : instagram

సోషల్‌ మీడియా నుంచి ఐశ్వర్య ఎగ్జిట్‌

'గట్ట కుస్తీ 2' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ రావడంతో ఆమె తన అకౌంట్‌ను డిలీట్ చేశారట.  ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా స్పందించింది ఐశ్వర్య లక్ష్మి. ఎందుకు సోషల్‌ మీడియా నుంచి తప్పుకుందో వెల్లడించింది.

Related Articles

Related image1
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Related image2
Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్
35
నెగటివిటీ నుంచి దూరంగా ఉండేందుకే
Image Credit : instagram

నెగటివిటీ నుంచి దూరంగా ఉండేందుకే

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, `సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. దానివల్ల బయట జనాలు నాతో మాట్లాడే తీరు కూడా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉన్నాను. వంద కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్‌ మీడియాలోకి రాను` అని చెప్పింది.

45
జనాలు నన్ను ద్వేషిస్తున్నారనిపించేది
Image Credit : instagram

జనాలు నన్ను ద్వేషిస్తున్నారనిపించేది

"సోషల్ మీడియాలో నాకు సేఫ్‌గా అనిపించలేదు. నా శరీరం గురించి మాట్లాడేవారు, ఫొటోలు మార్ఫింగ్ చేసేవారు, జడ్జ్ చేసేవారు. ఒక్క నెగటివ్ కామెంట్ వచ్చినా, జనాలు నన్ను ద్వేషిస్తున్నారని అనిపించేది. దానివల్ల సిగ్గుగా, ఇబ్బందిగా ఉండేది. ఎవరైనా కలిసినా, వాళ్లతో మాట్లాడకుండా త్వరగా వెళ్లిపోయేదాన్ని" అని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది.

55
ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమవడం బాధగానే ఉంది, కానీ
Image Credit : instagram

ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమవడం బాధగానే ఉంది, కానీ

"ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉంటే, జనాల మనసులకు కూడా దూరమైనట్టే. కానీ నాలోని కళాకారిణి కోసం, నాలోని చిన్నపిల్ల కోసం ఇదంతా చేస్తున్నాను" అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు మూవీతోపాటు బాలాజీ మోహన్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ 'లవ్' సిరీస్‌లో అర్జున్ దాస్‌తో కలిసి నటిస్తుంది. ఆనంద్ దర్శకత్వంలో ఓ తమిళ పీరియడ్ సినిమాలో పోలీస్ అధికారి పాత్ర కూడా చేస్తుంది. సతీష్ రాజా ధర్మర్ డైరెక్షన్‌లో 'తీవినై పొట్రు', 'ఆశా' అనే మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య లక్ష్మి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: సెట్ లో చెప్పుతో కొట్టుకున్న వెంకటేష్.. ఎందుకో తెలిస్తే బాబు బంగారం అనాల్సిందే!
Recommended image2
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Recommended image3
Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్
Related Stories
Recommended image1
Jana Nayagan Team Salary: 'జన నాయగన్' స్టార్ల రెమ్యూనరేషన్‌... విజయ్‌ కి హైయ్యెస్ట్, మిగిలిన వారికి ఎంతంటే?
Recommended image2
Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved