- Home
- Entertainment
- Brahmamudi: కావ్యని గదిలో బంధించిన అపర్ణ.. రాజ్ ని అలా చూసి షాకైన కుటుంబ సభ్యులు..?
Brahmamudi: కావ్యని గదిలో బంధించిన అపర్ణ.. రాజ్ ని అలా చూసి షాకైన కుటుంబ సభ్యులు..?
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. తమ ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

మరోవైపు పాల గ్లాసుతో గదిలోకి వచ్చి మెలికలు తిరిగిపోతున్న భార్య ప్రవర్తన అని చూసి ఆశ్చర్యపోతాడు కృష్ణమూర్తి. ఏమైంది అని భార్యని అడుగుతాడు. శోభనం అంటుంది కనకం. మనకి శోభనం ఏంటి అంటాడు కృష్ణమూర్తి. మనకు కాదండి మన అమ్మాయికి అంటుంది కనకం. మరి నువ్వు ఎందుకు మెలికలు తిరిగిపోతున్నావు అంటే మన శోభనం గుర్తొచ్చింది అంటుంది. మరోవైపు శోభనం గదిలోకి వచ్చిన కావ్యని నా కాళ్ళకి నమస్కారం చేస్తావా అని అడుగుతాడు రాజ్. ఏమి మాట్లాడకుండా గ్లాస్ అతను చేతిలో పెడుతుంది కావ్య. ఇప్పుడేంటి నేను సగం తాగి మిగిలినవి నీకు ఇవ్వాలా నువ్వేమైనా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళానివా కావాలంటే మొత్తం నువ్వే తాగు అంటాడు రాజ్.
నాకు పాలు అంటే అసహ్యం ఆ గ్లాసు మిమ్మల్ని పట్టుకోమని ఇచ్చాను ఎక్కడా పెట్టడానికి వీలు లేకుండా మొత్తం అన్ని డెకరేషన్ తో నింపేశారు అంటూ డెకరేషన్ చేసిన మంచం మీద కూర్చొని స్వీట్లు తింటుంది కావ్య. ఇది శోభనం గది కొంచెం అయినా సిగ్గుపడతారు అంటాడు రాజ్. మిమ్మల్ని చేసుకోవడానికి సిగ్గుపడాలి కానీ మిమ్మల్ని చూసి సిగ్గు పడటం ఏంటి అంటుంది కావ్య. నీకు పొగరు బాగా ఎక్కువ.. నువ్వంటే ఇష్టం లేదు అంటాడు రాజ్. పొగరు ఆడపిల్లలకి అందం అంటుంది కావ్య. ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో లెక్కలేనన్ని ఊహలతో డిజైన్ చేసుకున్న కళలతో శోభనం గదిలోకి అడుగుపెడుతుంది తెలుసా అంటుంది కావ్య. నేను మాత్రం లెక్కలేనని తిక్క ఆలోచనలతో, బోలెడంత ఫ్రస్టేషన్తో లోపలికి బాడీ పెట్టాను పొగరుబోతు పోట్ల గిత్త అంటాడు రాజ్.
ఈరోజు మనిద్దరికీ ఫస్ట్ నైట్ అని కావ్య అంటే.. ముందు నువ్వు అర్జెంటుగా బయటికి పో అంటాడు రాజ్. సరే బయటకు వెళ్లి మిమ్మల్ని డాక్టర్ని చూపించమంటాను పెళ్లికూతురు గదిలోకి వస్తే బయట పొమ్మంటున్నారు కదా అంటుంది కావ్య. అలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని కంగారుగా చెప్తాడు రాజ్. పెళ్లి చేసుకొని శోభనం కుదరదు అంటే ఎలా అంటూ అతని మీదికి వెళ్తుంది కావ్య. నీలో కూడా ఒక రౌడీ లేడీ ఉంటుందని ఊహించలేకపోయాను అంటాడు రాజ్. ఒక్కసారిగా తుళ్ళిపడి ఇదంతా నా ఊహ ఎంత భయంకరంగా ఉంది. ఊహ ఇంత భయంకరంగా ఉంటే ఒరిజినాలిటీ ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శోభనం జరగకూడదు అనుకుంటాడు రాజ్. మరొకవైపు శోభనం అనేసరికి నాకు ఒళ్ళు మండుతుంది.
ఎంత కొట్టుకునే మొగుడు పెళ్ళాలైనా రాత్రి అయ్యేసరికి ఒకటైపోతారు. ఈ జంట కూడా అలాగే చేస్తే మన పర్పస్ పనికి రాకుండా పోతుంది. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడు తూర్పు పడమరలాగే ఉండాలి. అలాంటి భార్యతో పడలేక రాజ్ బ్రతుకంతా నరకం చూడాలి అని కొడుక్కి చెప్తుంది రుద్రాణి. నీ తెలివి ఉపయోగించి ఈ శోభనం జరగకుండా చేయు అంటుంది. కలపడం అంటే కష్టం కానీ విడగొట్టడం చాలా సులువు అలాగే చేస్తాను అంటాడు రాహుల్. మరోవైపు కోడలి దగ్గరికి వచ్చిన అపర్ణ చేతిలో పాల గ్లాస్ ఏది గదిలోకి పంపించడానికి ముత్తయిదువలేరి అయినా నీకు వాళ్ళు ఎవరు అవసరం లేదు ధైర్యంగా కూర్చున్న దానివి శోభనం గదిలోకి మాత్రం ఒంటరిగా వెళ్లలేవా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది అపర్ణ.
మీ అబ్బాయి తరఫున శోభనం ఇష్టం లేదని చెప్పిన మీరు ఒక ఆడదానిగా నీకు ఇష్టమైన అని నన్ను అడిగారా, నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయని ఎందుకు కనుక్కోలేకపోయారు. ఎందుకు భర్తని భార్య మాత్రమే అడిగి భార్యని వదిలేశారు నేను కూడా మనిషినే కదా అంటుంది కావ్య. మా ఇంట్లో డబ్బు మాత్రమే లేదు ఆత్మ అభిమానం మెండుగానే ఉంది. నేను ఇదంతా మీ తప్పుని ఎత్తి చూపటానికి చెప్పటం లేదు, మీ అబ్బాయికి నేను అసలు ఇష్టం లేదు అలాంటి వ్యక్తి దగ్గరికి ఎలా అలంకరించుకుని వెళ్తే ఏం మాట్లాడుతారో మీరు ఊహించగలరా అంటుంది కావ్య. అబద్దమాడి పెళ్లి పీటల మీద వరకు తీసుకొని వచ్చారు అబద్ధం ఆడి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు అలాంటి నీకు ఒక వ్యక్తిత్వం ఉంటుందని ఎలా అనుకోవాలి.
నీ అభిప్రాయాన్ని ఎందుకు గౌరవించాలి అసలు నిన్ను మనిషిగానే గుర్తించలేదు అందుకే నిన్ను ఈ గదిలో ఉన్న పట్టించుకోలేదు అంటుంది అపర్ణ. నీకు గాని మీ అమ్మకు గాని మీ అక్కకు గాని నీతుల గురించి విలువల గురించి చెప్పటం అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మగవాడి బలహీనతలని అడ్డం పెట్టుకొని నువ్వు వాడిని వశపరచుకున్న ఆశ్చర్యం లేదు అంటుంది అపర్ణ. మీరు అనవలసిన మాటేనా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటూ కోపంగా మాట్లాడుతుంది కావ్య. మీరు బలవంతంగా పంపించిన సరే నేను ఆ గదిలోకి వెళ్ళను. నాకు ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ ని దిగజార్చే హక్కు నా భర్తకి లేదు నా అత్తకి లేదు అంటూ దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది కావ్య. నిన్ను ఎలా వదిలేసి నేను ప్రశాంతంగా ఎలా వెళ్తాను.
నీకు ఎలాగూ ఆ గదిలోకి వెళ్ళటం ఇష్టం లేదన్నావు కదా అందుకే గదిలోనే భద్రంగా ఉండు అంటూ ఆమె గదికి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోతుంది అపర్ణ. మరోవైపు పెళ్లి విషయంలో మీ మాటకి కట్టుబడి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాను కానీ ఇప్పటికీ నాకు ఆమె భార్య లాగా కనిపించడం లేదు. నా స్థానంలో అబద్ధం ముసుగు అవి మాత్రమే కనిపిస్తున్నాయి అప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఈ గదిలోకి ఎలా రానివ్వాలి. మీరే న్యాయం చెప్పండి అంటాడు రాజ్. నువ్వు న్యాయం గురించి మాట్లాడితే మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం ఒకసారి తాళి కట్టిన తర్వాత ఆమె పూర్తి బాధ్యత నీదే అంటాడు సీతారామయ్య. ఆ అమ్మాయిని నచ్చజెప్పి మానసికంగా సన్నద్ధం చేసిన తరువాత నువ్విలా మాట్లాడితే ఎలా రాజ్ అంటుంది చిట్టి. తనువు కోరుకునేవాడైతే ఇలా తగువు పెట్టుకోడు.
మనసు కుదుటపడితే వాడికే ఆ అమ్మాయి అర్థమవుతుంది అంటాడు సీతారామయ్య. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఏమని సమాధానం చెప్పాలి అంటుంది చిట్టి. అదేదో వాడే చెప్పుకుంటాడు పదా అంటూ భార్యని తీసుకొని వెళ్ళిపోతాడు సీతారామయ్య. మరోవైపు గదంతా చిందరవందర చేసేస్తున్న రాజ్ దగ్గరికి వచ్చిన రాహుల్ ఎందుకు ఇంత ఫ్రెస్టేట్ అవుతున్నావు అని అడుగుతాడు.నాకు పెళ్లయింది అందుకే ఇంత ఫ్రస్టేషన్. మీడియా ముందు నవ్వుల పాలయ్యాను వాళ్లు నన్ను ఎన్ని ప్రశ్నలు వేశారు నువ్వు కూడా చూశావు కదా అందుకే ఈ ప్రెస్టేషన్ అంటాడు రాజ్. తరువాయి భాగంలో కావ్య గదిలోకి వచ్చిన రాజ్ ఎందుకు నా జీవితంలో నిప్పులు పోసావు అంటూ నిలదీస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే కావ్య గది నుంచి వస్తున్న రాజ్ ని చూసి షాక్ అవుతారు కుటుంబ సభ్యులందరు.