- Home
- Entertainment
- సాయిధరమ్ తేజ్ కొంప ముంచుతున్న వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి.. తెరపైకి తన ప్రేమ వ్యవహారం.. ఇదెక్కడి గోల..
సాయిధరమ్ తేజ్ కొంప ముంచుతున్న వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి.. తెరపైకి తన ప్రేమ వ్యవహారం.. ఇదెక్కడి గోల..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే ఇది సాయిధరమ్ తేజ్ కొంప ముంచుతుంది. ఆయన వ్యవహారం తెరపైకి వస్తుంది.

మెగా ఫ్యామిలీలో లవ్ స్టోరీస్ పవన్ కళ్యాణ్ నుంచి ప్రారంభమయ్యాయి. ఆయన మొదటి వివాహం పెద్దలు కుదిర్చినదే అయినా, రేణు దేశాయ్‌తో రెండో వివాహం మాత్రం ప్రేమ వివాహమే. ఆ తర్వాత మూడో పెళ్లి కూడా ప్రేమ పెళ్లినే. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో విడిపోయి కళ్యాణ్ దేవ్‌ని రెండో పెళ్లి చేసుకుంది. ఈ బంధం కూడా నిలవడం లేదని సమాచారం. మరోవైపు మెగా డాటర్ నిహారిక పెళ్లి మూడేళ్ల క్రితం అయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు వీరిద్దరి విడిపోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా, అందరిని ఆశ్చర్యపరుస్తూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారని గతేడాది నుంచి వార్తలొస్తున్నా, వాటిని రహస్యంగా ఉంచుతూ, ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌తో ఓపెన్ అయ్యారు. గత వారం వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మెగా ఫ్యామిలీతోపాటు సన్నిహితులు ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు. త్వరలో ఈ ఇద్దరు పెళ్లిపీఠలెక్కబోతున్నారు.
వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కొంప ముంచుతుంది. సాయి ప్రేమ వ్యవహారం కాస్త ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. సాయిధరమ్ తేజ్ కూడాప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలా కాలం క్రితం వినిపించాయి. ఇటీవల అవి ఆగిపోయాయి కానీ, మూడేళ్ల క్రితం వరకు అడపాదడపా సాయిధరమ్ తేజ్ ప్రేమకి సంబంధించిన రూమర్లు నెట్టింట, ఫిల్మ్ నగర్‌లో చక్కరలు కొడుతూనే ఉన్నాయి.
సాయిధరమ్ తేజ్.. హీరోయిన్ రెజీనాతో లవ్ లో ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఇద్దరు కలిసి తిరిగినట్టు న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఈ రేంజ్‌లో లేకపోవడంతో అవి అంతగా స్ప్రెడ్ కాలేదు, కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం బాగానే చర్చ జరిగింది. సాయి, రెజీనా ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారని అన్నారు. ఈ ఇద్దరు కలిసి `పిల్ల నువ్వులేని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని, ఏడేనిమిదేళ్ల క్రితం నుంచే వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అన్నారు.
అయితే ఆ తర్వాత ఆ రూమర్స్ ఆగిపోయాయి. ఇంతలో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి గురయ్యారు. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారు. తిరిగి మామూలు మనిషి అయ్యారు. ఇప్పుడు రెగ్యూలర్‌గా సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రెజీనాతో రిలేషన్‌షిప్ ఉందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇద్దరు ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రమాదం తర్వాత సాయితేజ్ జీవితమే మారిపోయింది. దీంతో ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారా? అనేది డౌట్.
కానీ వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పెళ్లికి సిద్ధమంటూ కొత్త రూమర్స్ నెట్టింట రచ్చ చేస్తుంది. మరో మెగా హీరో హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమంటూ ఆ వార్త చక్కర్లు కొడుతుంది. దీంతో వరుణ్, లావణ్యల పెళ్లి సాయితేజ్ కొంపముంచుతుంది. ఇదిప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మరి సాయి, రెజీనాల మధ్య లవ్‌లో నిజమెంతా? ఒకవేళ ఉంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా? అనేది చూడాలి. దీనికి మున్ముందు క్లారిటీ రానుంది.