- Home
- Entertainment
- Ennenno Jnamala Bandam: డీఎన్ఏ 'రిపోర్ట్'లను అభిమన్యు ముఖం మీద కొట్టిన యష్.. భార్య గురించి ప్రౌడ్ గా చెబుతూ!
Ennenno Jnamala Bandam: డీఎన్ఏ 'రిపోర్ట్'లను అభిమన్యు ముఖం మీద కొట్టిన యష్.. భార్య గురించి ప్రౌడ్ గా చెబుతూ!
Ennenno Jnamala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Jnamala Bandam) సీరియల్ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఖుషి తన తండ్రి తనతో మాట్లాడటం కోసం ఆంజనేయస్వామి చుట్టు ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. అది చూసిన వేద (Vedha) ఎంతో భాద పడుతుంది. ఈలోపు వేదకు డాక్టర్ కాల్ చేసి డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రెడీ అయింది అని చెబుతుంది. మరోవైపు వసంత్ (Vasanth) తన కాబోయే భార్య ఎదపై పడుకుని నీ గుండె నా పేరే కలవరిస్తుంది అని అంటాడు.
ఇక ఒక డాక్టర్ అంకిత్ (Ankith) వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి డీఎన్ఏ రిపోర్ట్ వేద గారికి ఇవ్వండి అని చెబుతాడు. ఇక అది గమనించిన మాళవిక అతనికి డబ్బు ఇచ్చి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటుంది. ఇక అభిమన్యు (Abhimanyu) కు ఫోన్ చేసి వేద ఎవరితో డీఎన్ఏ టెస్ట్ చేయించింది అని చెబుతుంది.
ఇక దాంతో అభిమన్యు (Abhimanyu) ఆ డీఎన్ఏ రిపోర్ట్ వేదకు చేరే లోపు ఎలాగైనా నువ్వు చేజిక్కించుకోవాలని అంటాడు. ఇక చిత్ర చివరికి ఆ రిపోర్ట్ ను వేద కు ఇస్తుంది. ఇక వేద యష్ (Yash) చేతిలో రిపోర్ట్ పెట్టి కంగ్రాట్స్ చెప్పి మీరే ఖుషి కన్నతండ్రి అని రుజువు చేస్తుంది. ఒకసారి ఆ రిపోర్ట్ చూడండి అని అంటుంది.
ఇక డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఓపెన్ చేసి యష్ (Yash) ఖుషి కన్నతండ్రి తానే అని తెలుస్తుంది. దాంతో యష్ కి ఎక్కడలేని సంతోషం వస్తుంది. ఈ క్రమంలో యష్ కి ఆనంద బాష్పాలు బయట పడతాయి. ఇక వెంటనే ఖుషి (Khushi) దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళతాడు.
ఇక ఖుషి (Khushi) ను ఆనందంగా ఎత్తుకొని తిప్పుతాడు. అంతే కాకుండా తన కూతురిని మనస్ఫూర్తిగా గా ముద్దుపెట్టు కుంటాడు. ఇక ఖుషి డాడీ నువ్ నాతో మాట్లాడాలి అని అంజిను కోరుకున్నాను అని చెబుతుంది. దాంతో యష్ (Yash) ఖుషిను ప్రేమగా హాగ్ చేసుకుంటాడు.
ఇక తరువాయి భాగంలో యష్ (Yash) అభిమన్యు దంపతులు దగ్గరకి వెళ్లి డీఎన్ఏ రిపోర్ట్ చూపిస్తూ అభిమన్యు ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడుతాడు. ఆ క్రమంలో తన భార్య వేద (Vedha) గురించి ప్రౌడ్ గా చెబుతాడు. ఆ సమయంలో పక్కన వేద కూడా ఉంటుంది.