ఆ అక్కినేని హీరోకి టచ్ లో ఉన్న సమంత... చైతూ అంటే మాత్రం ఫైర్
నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆమెకు నాగ చైతన్య అంటే చాలా కోపం. గతంలో కొన్ని సందర్భాల్లో ఆమె మాటలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అయితే సమంత ఓ అక్కినేని హీరోతో టచ్ లో ఉంటుంది.

Samantha
సమంత-నాగ చైతన్య ఒకప్పటి టాలీవుడ్ లవ్లీ కపుల్. తన మొదటి చిత్ర హీరో అయిన నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత కూడా సమంత నటన కొనసాగించారు. ఆమె గ్లామరస్ రోల్స్ చేయడం విశేషం. సమంతకు అక్కినేని ఫ్యామిలీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. 2021లో సమంత-నాగ చైతన్య మధ్య మనస్పర్థలు వచ్చాయి., కొన్నాళ్లుగా విడిగా ఉన్న ఈ జంట అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో సమంత విమర్శలు ఎదుర్కొంది. ఆమె మీద పలు రూమర్స్ వినిపించాయి. ఒకటి రెండు సందర్భాల్లో నాగ చైతన్య మీద కోపాన్ని ప్రదర్శించింది సమంత. నాగ చైతన్య మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యాడు.
Samantha
నాగ చైతన్య అంటే సమంతకు చాలా కోపం ఉన్నది మాత్రం నిజం. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచాల్సి వస్తే అక్కడ కత్తులు కూడా పెట్టాలి.. అని కరణ్ జోహార్ షోలో సమంత వెల్లడించింది. నాగ చైతన్య అంటే గిట్టని సమంత ఓ అక్కినేని హీరోతో టచ్ లో ఉంటుంది. నాగ చైతన్య తమ్ముడు అఖిల్ తో పరిచయాలు కొనసాగిస్తోంది.
Samantha
ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కాగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది సమంత. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అఖిల్ ఫోటో షేర్ చేసి బెస్ట్ విషెస్ చెప్పింది. దాంతో అఖిల్ పై సమంతకు ఉన్న అభిమానం, స్నేహం బయటపడ్డాయి. నాగ చైతన్యను వ్యతిరేకిస్తున్న సమంత, అఖిల్ తో మాత్రం టచ్ లోనే ఉంటుందనే విషయం వెలుగులోకి వచ్చింది.