Devata: దేవికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్న ఆదిత్య... తండ్రి కోసం తపన
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగష్టు 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకమ్మ మాధవ్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు నువ్వు చిన్మయిని,దేవిని ఇద్దరినీ స్కూలుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి దేవిని ఎక్కడికో తీసుకెళ్లావు అట అసలు ప్రతిరోజు ఇంట్లోనే ఉండే వాడివి ఇప్పుడు బయట ఎక్కడకో తిరుగుతున్నావు. నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పినా అవి అబద్ధాలు నాకు తెలుసు. నీ మీద నాకు ఈ మధ్య అనుమానం వస్తుంది మీ నాన్న ఊరు ప్రెసిడెంట్ అని మర్చిపోకు. నువ్వేపని చేసినా ఆయన ప్రాణాలు కంటే పరువుకి విలువ ఇస్తారు. ఆ పరువు తియ్యాలని చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. మాధవ్ మనసులో నామీద అమ్మకి ఎందుకు నుమనం వచ్చింది అని అనుకుంటాడు.
ఆ తర్వాత సీన్లో దేవి, వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చాడు అని విషమంతా గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతటిలో రుక్మిణి దేవి కి అన్నం పెడుతున్నప్పుడు దేవి నాకు తినాలని లేదమ్మా అని చెప్పి అమ్మ ని హద్దుకొని నాకు నాయన గుర్తొస్తున్నాడు అమ్మ నాయన కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య, మాధవ్ దేవిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో ఏం చేస్తుంటాడు. ఇంకిలా లేట్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వెంటనే నేనే వాళ్ళ నాన్నని అని దేవికి చెప్పేయడం మంచిదేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో సత్య ఆదిత్య పడుకుంటున్నప్పుడు కమల కూతురు ఏడుపులు వినిపిస్తాయి.
ఇంత రాత్రి ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని సత్య చూడడానికి వెళ్తుంది. అప్పుడు ఆదిత్య, రుక్మిణి ఆదిత్య పెళ్లి ఫోటో చూసి ఈ ఫోటో దేవికి చూపించాలి. నేనే తన తండ్రి అని చెప్పేయాలి నా భార్య పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటాడు.అప్పుడు ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి, దేవిని నేను చెప్పిన ప్రదేశానికి తీసుకురా ఈరోజు నేనే దేవి తండ్రి అని చెప్పేస్తాను, దేవి బయటకి వస్తున్నట్లు మాధవ్ కి చెప్పొద్దు అని అంటాడు. సరే అని చెప్పి దేవి దగ్గరికి వచ్చేసరికి దేవి రుక్మిణి తీసుకువెళ్లి అమ్మ నేను నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను పద అని ఆ తాగుబోతు ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. అమ్మ ఇతనే కదా మన నాన్న నిజం చెప్పమ్మా.
అప్పుడు తాగుబోతుగా ఉన్నాడు ఇప్పుడు మనకోసం మారతారు కదా అని అనగా వీడు ఎవడో నాకు తెలియదు అని అంటుంది. నువ్వు ఇలా చెప్తావని కూడా చెప్పారు అమ్మ, నాన్న మళ్ళీ మనకి హాని చేస్తాడు అని నువ్వు ఇలా అంటున్నావ్ నాకు తెలుసు అని దేవి అంటుంది. ఎంత చెప్పినా దేవి వినదు. ఇంతట్లో మాధవ్ అక్కడ పెంట జరుగుతుంది అని ఆనందపడిపోతూ గిటార్ వాయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో ఆదిత్య క్యాలెండర్ చూసి ఈ రోజు మంచి రోజే ఈరోజు చెప్పేద్దాం.
ఈరోజు నుంచి ఇంక దేవి నన్ను నాన్న అని అందరి ముందు పిలుస్తుంది. ఈరోజే అన్ని జరిగిపోవాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో,మాధవ్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు,నిన్నే చెప్పాడు కానీ మరి ఇంత దారుణం అని అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది రుక్మిణి. ఇంతట్లో దేవి అక్కడికి వచ్చి అమ్మ, నాన్నను తీసుకువెళ్దాం అమ్మ మంచిగా మార్చుకుందాం అమ్మ అని అంటుంది. ఆయన మీ నాయన కాదు ముందు ఇక్కడి నుంచి పదా అని రుక్మిణి అంటుంది. దేవి ఒప్పుకోకపోగా రేపు మళ్ళీ ఇక్కడికి వద్దాం అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు చెప్పినట్టు ఇంటికి రా అని అంటుంది రుక్మిణి.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయ భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!