Ennenno Janmala Bandham: ఆదిత్యలో మార్పు.. అభి చేతిలో మరోసారి మోసపోయిన మాళవిక!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రేమించిన వాడి చేతిలో పదేపదే మోసపోతున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీ అందరి డాన్సులు చూస్తే మేము జడుచుకుంటామని అమ్మ సంగీత్ క్యాన్సిల్ చేసింది అంటూ అమ్మమ్మ నానమ్మల్ని ఏడిపిస్తుంది ఖుషి. అందరూ నవ్వుకుంటారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో మంచి మాటలు మాట్లాడుకుందాము అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి మాట చెప్పి వసంత్ దంపతులకు బ్లెస్సింగ్స్ ఇస్తారు.
ఇంతలో ఆదిత్య రావటం చూసి మాలిని గబగబా వెళ్లి ఆదిత్య ని హత్తుకుంటుంది. మా మధ్య పెరగటం లేదు అంటూ బాధపడుతుంది. నాన్న రెండు రోజులకి ఒకసారి వస్తున్నాడు అని ఆదిత్య చెప్పడంతో సంతోషిస్తుంది మాలిని. నిజమా మరి నాకెందుకు చెప్పలేదు అంటుంది మాళవిక. నువ్వు బిజీగా ఉన్నావు కదా అందుకే చెప్పలేదు లాస్ట్ వీక్ వేద ఆంటీ, డాడీ వచ్చారు అంటాడు ఆదిత్య.
యష్, ఆదిత్య ని ముద్దు పెట్టుకుంటాడు. ఆదిత్యని చూసి ఖుషి భయపడే వేద వెనుక దాక్కుంటుంది. తనని పిలిచే ఆదిత్యతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తాడు యష్. అప్పుడు ఖుషి హ్యాపీ అవుతుంది. వాళ్ళిద్దర్నీ అలా చూసి ఎమోషనల్ అవుతాడు యష్. ఆదిత్య వాళ్ళు ఆడుకోడానికి వెళ్ళిపోతారు. థాంక్స్ వేద నువ్వు చెప్పినట్లు చేయటం వల్లే నా కొడుకు లో మార్పు వచ్చింది అంటాడు యష్.
మరోవైపు ఫోన్ మాట్లాడుతున్న మాళవిక దగ్గరికి వచ్చి ఆకలి వేస్తుంది అన్నం పెట్టమంటాడు ఆదిత్య. గెస్ట్ లు వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకుని వచ్చి నీకు భోజనం పెడతాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని వెళ్ళిపోతుంది మాళవిక. ఆ మాటలు విన్న మాళవిక నీకు ఖుషికి నేను భోజనం పెడతాను రా అంటుంది.
అతను మొహమాటపడుతుంటే వేదకి చెప్పి భోజనం తెప్పించి తనే వాళ్ళ అన్నయ్యకి భోజనం తినిపిస్తుంది ఖుషీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను సారీ అంటాడు ఆదిత్య. ఇప్పుడు బాగా చూసుకుంటున్నావు కదా అది చాల్లే అంటుంది ఖుషి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఎమోషనల్ అవుతాడు యష్. ఆదిత్యలో బాగా మార్పు వచ్చింది అంటాడు.
కరెక్టే కానీ మాళవిక ప్రవర్తన గురించి మీకు తెలిసిందే కదా ఆ ప్రభావం కూడా ఆదిత్య మీద పడకూడదు. మాళవిక ని కన్విన్స్ చేసి ఆదిత్యని మన ఇంటికి తీసుకురండి అని భర్తని మాళవిక దగ్గరికి పంపిస్తుంది వేద. యష్ మాటలు విన్న మాళవిక కోపంతో రగిలిపోతుంది. నా కూతుర్ని నుంచి దూరం చేసినట్లే కొడుకుని కూడా దూరం చేయాలని చూస్తున్నారా అంటూ కేకలు వేస్తుంది.
ఒకసారి ఆలోచించు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు నీకు ప్రైవసీ ఉండాలి కదా అయినా అభిమన్యు మెంటాలిటీ మీద ఎవరికీ నమ్మకం లేదు అందుకే ఆదిత్యని నాతో పంపించు అని రిక్వెస్ట్ చేస్తాడు యష్. అభి కి ఆదిత్య అంటే చాలా ఇష్టం అభి యే నా బిడ్డకి తండ్రి అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఆ తర్వాత అభి దగ్గరికి బాండ్ పేపర్స్ తీసుకొని వెళ్తుంది.
వీటి మీద సైన్ పెట్టు అంటుంది. ఏంటిది అని అడుగుతాడు అభి. ఆదిత్యని నా నుంచి దూరం చేయాలని యష్ వాళ్లు ప్రయత్నిస్తున్నారు అందుకే లీగల్ గా నువ్వు దత్తత తీసుకో.. నీ ఆస్తికి వారసుడిగా ఆదిత్యని ప్రకటించు అంటుంది మాళవిక. ఒకసారి గా షాక్ అవుతాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు. ఇది కేవలం సెక్యూరిటీ కోసం మాత్రమే నా కొడుక్కి ఫ్యూచర్ ఏంటి అని యష్ లాంటి వాళ్లు అడిగితే ఈ పేపర్స్ వాళ్ళు మొహన కొడతాను అంటుంది మాళవిక.
వలం బాండ్ పేపర్ మీద సైన్ చేసినంత మాత్రాన అడాప్టింగ్ అయిపోదు దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది పెళ్లి అవని అవన్నీ తర్వాత చూద్దాము అంటాడు అభి. ఆ మాటలు నమ్మి అభిని హగ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. పిచ్చి మొహం ది అన్ని నమ్మేస్తుంది. అనుకున్నది సాధించడానికి నిన్ను ఒక పావు లాగా వాడుకుంటాను ఆ తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అని మనసులో అనుకుంటాడు అభి. మరోవైపు యశ్ ను వెతుక్కుంటూ పార్టీలోకి వస్తుంది వేద. అక్కడ యష్ లేకపోవటంతో తిరిగి వెళ్ళిపోబోతుంటే ఆమెని మిస్ బిహేవ్ చేస్తారు అభి ఫ్రెండ్స్.
డ్రింక్ చేయమంటూ వేదని ప్రెజర్ చేస్తారు. వాళ్లని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది వేద. వేద చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు అభి. వేద కంగారుపడుతుంది. యష్ అభి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. అభి కంగారు పడుతాడు. తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.