- Home
- Entertainment
- Adipurush First Review: `ఆదిపురుష్` ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంత?.. ప్రభాస్ పంట పండిందా లేదా?
Adipurush First Review: `ఆదిపురుష్` ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంత?.. ప్రభాస్ పంట పండిందా లేదా?
ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ `ఆదిపురుష్`. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రస్తుతం ఇండియా మొత్తం చర్చించుకుంటున్న సినిమా `ఆదిపురుష్`. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నటించడం, రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడం, ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక కథలు బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ఇందులో రాముడిగా నటించారు. ఆయనకు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై భారీ హైప్‌ని పెంచింది. ట్రైలర్, ఫైనల్ ట్రైలర్లు సైతం సినిమాపై అంచనాలను పెంచాయి. ఆడియెన్స్ లో ఆశలు కల్పించాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ క్రిటిక్స్, సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పిలవబడే ఉమైర్ సంధు తాజాగా ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు. అత్యంత కాంట్రవర్షియల్ క్రిటిక్‌గా పేరుతెచ్చుకున్న ఉమైర్ సంధు చెప్పినవాటిలో చాలా వరకు అబద్దాలు, అవాస్తవాలుగానే ఉంటాయి. దీంతో ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన `ఆదిపురుష్`పై తన రివ్యూ ఇచ్చాడు.
Adipurush
సినిమాపై ఉమైర్ సంధు పూర్తిగా నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా మొత్తం భారీ అని చెబుతూనే, అందులో సోల్ లేదని, ప్రభాస్ యాక్టింగ్ క్లాసులు తీసుకోవాలంటూ పెద్ద షాకిచ్చాడు. `ఆదిపురుష్` పెద్ద స్టార్స్, పెద్ద కన్వాస్, భారీ బడ్జె్, వీఎఫ్‌ఎక్స్, భారీ అంచనాల నేపథ్యంలో ఇది భారీ సినిమా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద నిరాశని కలిగిస్తుంది. సినిమాకి సోల్ లేదు, నటీనటులందరి చెత్త ప్రదర్శన చేశారు, ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు కావాలి` అంటూ బాంబ్ పేల్చాడు. అంతేకాదు `ఆదిపురుష్` పెద్ద టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్‌లకు బాక్సాఫీసు వద్ద బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుందని పేర్కొన్నాడు. సినిమాకి రెండు రేటింగ్ ఇచ్చాడు.
దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ని యాక్టింగ్ గురించి మాట్లాడతావా? చత్రపతి, చక్రం వంటి సినిమాల సమయంలో నువ్వు ఎక్కడున్నావ్ రా బచ్చా, నువ్వు నెగటివ్ రివ్యూ ఇచ్చావంటే సినిమా బ్లాక్ బస్టరే అని అంటున్నారు. నిన్ను ఎవరూ నమ్మరు, నువ్వు ఒక ఫేక్, నీ ట్వీట్లు అంతకంటే ఫేక్ అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు. బూతులతో విరుచుకుపడుతున్నారు.
నిజానికి ఉమైర్‌సంధు ఇలాంటి రివ్యూలు చాలా పెద్ద సినిమాలకు ఇచ్చారు. కానీ 90శాతం అతను చెప్పింది రివర్స్ అయ్యింది. పైగా అతను చాలా వరకు నెగటివ్ రివ్యూలిస్తుంటారు. దీంతో ఇతన్ని ఎవరూ నమ్మడం లేదు. కాకపోతే కాంట్రవర్షియల్‌ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటాడు. వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ విమర్శల పాలవుతుంటాడు. ఇక `ఆదిపురుష్` సినిమా ఈ నెల 16న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. దాదాపు ఆరువేలకుపైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 3డీలో కాకుండా 2డీలో దీన్ని తీసుకురాబోతున్నారని సమాచారం.