- Home
- Entertainment
- Anasuya: ఎవరో పెట్టిన బిక్ష కాదు, తగ్గేదే లే .. అనసూయపై అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Anasuya: ఎవరో పెట్టిన బిక్ష కాదు, తగ్గేదే లే .. అనసూయపై అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
తన హాట్ అండ్ గ్లామర్ లుక్స్ తో అనసూయ బుల్లితెరకే వన్నె తెస్తోంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

తన హాట్ అండ్ గ్లామర్ లుక్స్ తో అనసూయ బుల్లితెరకే వన్నె తెస్తోంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. అనసూయ టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.
పుష్ప చిత్రంలో సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీవీ కార్యక్రమాల్లో అనసూయ క్వీన్ అనే చెప్పాలి.
తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో అనసూయపై కమెడియన్ అదిరే అభి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనసూయ కూడా అభి కామెంట్స్ కి ఫిదా అయింది. ఆ వీడియోను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అభి మాట్లాడుతూ అనసూయని ముద్దుగా అను అని ప్రస్తావించాడు. 'అను నేను నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడర్ గా చేశావు, యాంకర్ గా చేశావు. ఇప్పుడు నటిగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నావు. నీ ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు. నువ్వు కష్టపడి సాధించుకున్నది అని అభి ప్రశంసలు కురిపించాడు.
పుష్ప హిట్ అయిన తర్వాత అనసూయ పేరు హిందీలో కూడా వ్యాపించింది. ఇక తగ్గేదే లే. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి.. మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ అదిరే ఒక రేంజ్ లో అనసూయపై పొగడ్తల వర్షం కురిపించాడు.
అనసూయ ఈ కామెంట్స్ ని లవ్ ఎమోజితో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిరే అభి బుల్లితెరపై సీనియర్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల జబర్దస్త్ ని వీడింది. సినిమాల్లో అవకాశాల కోసం అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.