- Home
- Entertainment
- చిరు, పవన్, చరణ్, బన్ని.. మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకు, మామా అల్లుడితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
చిరు, పవన్, చరణ్, బన్ని.. మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకు, మామా అల్లుడితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రీ కొడుకులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీమెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకు, మామ అల్లుడితో జంటగా నటించిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా? చిరు, పవన్, చరణ్, బన్నీతో రొమాన్స్ చేసిన తారలు.

టాలీవుడ్ లో మెగా హీరోల హవా..
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ గా ఎదిగి.. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆయన ఫ్యామిలీ నుంచి స్టార్ స్టార్ హీరోలు, పాన్ ఇండియా స్టార్లు, నిర్మాతలు, వ్యాపారవేత్తలు.. మొత్తంగా సౌత్ ఇండియాన్ కపూర్ ఫ్యామిలీ అనే పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి.
ఇక మెగా హరోలుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్.. ప్రస్తుతం స్టార్ హీరోల హోదాలో కొనసాగుతుండగా.. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లు టైర్ 2 హీరోలుగా కొనసాగుతున్నారు. నాగబాబు, నిహారిక, సుస్మిత నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నారు.
మెగా హీరోల సరసన టాప్ 3 హీరోయిన్లు..
చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లను స్టార్లుగా మార్చాడు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేశాడు. మెగా హీరోల సరసన నటించిన హీరోయిల్లలో చాలామంది టాప్ లో ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో 70 ఏళ్ల చిరంజీవితో.. 40 ఏళ్ల రామ్ చరణ్ వరకు.. నలుగురు హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్ల గురించి మీకు తెలుసా?
రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవితో కూడా జంటగా నటించిన ముగ్గరు హీరోయిన్లు ఎవరో కాదు కాజల్, శృతీ హాసన్, తమన్నా. ఈ ముగ్గురు హీరోయిన్లు మెగా హీరోల సరసన నటించి మెప్పించారు. ఇంతకీ వారు ఏ సినిమాల్లో జోడీలు కట్టారంటే?
కాజల్ అగర్వాల్..
మెగా ఫ్యామిలీ లో నలుగురు హీరోలతో జంటగా నటించింది కాజల్ అగర్వాల్. అల్లు అర్జున్ తో కాజల్ ఆర్య2, ఎవడు సినిమాల్లో జంటగా నటించింది. రామ్ చరణ్ తో కాజల్ మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో రొమాన్స్ చేసింది. ఇక పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కాజల్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో జోడీ కట్టింది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా కాజల్ ఓ సినిమాలో నటించింది. చిరంజీవి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ.. ఖైదీ నంబర్ 150 లో కాజల్ మెగాస్టార్ జోడీగా నటించి మెప్పించింది. మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకు, మామ, అల్లుడితో రొమాన్స్ చేసిన హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.
శ్రుతి హాసన్..
శ్రుతి హాసన్ కూడా మెగా ప్యామిలీలో నలుగురు హీరోలతో రొమాన్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ఈమధ్య కాలంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది బ్యూటీ.. అంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాల్లో నటించి మెప్పించింది.
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రుతి.. మరోసారి పవర్ స్టార్ సరసన కాటమరాయుడు మూవీలో నటించి ప్లాప్ ను ఫేస్ చేసింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో జోడీ కట్టిన ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ తో రేసుగుర్రం సినిమాలో రొమాన్స్ చేసింది.
తమన్నా భాటియా..
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా కూడా మెగా హీరోలతో రొమాన్స్ చేసిన తారల లిస్ట్ లో చేరిపోయింది. పవన్ కళ్యాణ్ తో గంగతో రాంబాబు సినిమాలో మాస్ పెర్ఫామెన్స్ ఇచ్చిన తమన్నా.. రామ్ చరణ్ తో రచ్చ సినిమాతో రచ్చ రచ్చ చేసింది. ఇక అల్లు అర్జున్ జోడీగా బద్రీనాథ్ సినిమాలో మెరిసింది తమన్నా.
ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి రెండు సినిమాల్లో మెరిసింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో భార్య పాత్రలో మెప్పించిన తమన్నా.. ఆతరువాత భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ జోడీగా నటించింది. ఇలా ముగ్గరు హీరోయిన్లు మెగా ఫ్యామిలీలో రెండు జనరేషన్లు హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి రచ్చ చేశారు.

