MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radhika Sarathkumar: నన్ను దారుణంగా మోసం చేశారు.. హీరోయిన్‌ రాధికపై సీనియర్‌ నటి సంచలన ఆరోపణలు

Radhika Sarathkumar: నన్ను దారుణంగా మోసం చేశారు.. హీరోయిన్‌ రాధికపై సీనియర్‌ నటి సంచలన ఆరోపణలు

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తనకు రావాల్సిన జీతం ఇవ్వకుండా మోసం చేశారంటూ మరో ప్రముఖ నటి విజి చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  

3 Min read
Author : Aithagoni Raju
Published : May 22 2026, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న విజి చంద్రశేఖర్‌
Image Credit : Instagram

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న విజి చంద్రశేఖర్‌

తమిళ చిత్ర పరిశ్రమలో విజి చంద్రశేఖర్ ఒక ప్రముఖ నటి. ఈమె దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ తీసిన 'తిల్లు ముల్లు' సినిమాలో రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటి సరితకు ఈమె సొంత చెల్లెలు. మొదటి సినిమా తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత భారతీరాజా 'కిళక్కు చీమయిలే' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి  తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వెండితెరతో పాటు బుల్లితెర పైనా ఆమె నటిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తనకు సరైన గుర్తింపు రాలేదని విజి చంద్రశేఖర్‌ ఆవేదన
Image Credit : Instagram

తనకు సరైన గుర్తింపు రాలేదని విజి చంద్రశేఖర్‌ ఆవేదన

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విజి చంద్రశేఖర్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు. తాను ఎంత బాగా నటించినా సరైన జీతం ఇవ్వలేదని, సరైన గుర్తింపు రాలేదనే బాధ ఉందని చెప్పారు. ఈ కారణంగా చాలాసార్లు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని కూడా అనుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో మంచి పాత్రల్లో నటించినా తనకు సరైన ఆదరణ లభించలేదని, కానీ దాని గురించి తాను ఎప్పుడూ బాధపడలేదని ఆమె అన్నారు.  

36
కష్టానికి తగ్గ జీతం ఇవ్వరు
Image Credit : Instagram

కష్టానికి తగ్గ జీతం ఇవ్వరు

చాలామంది తనను ఇతర నటీమణులతో పోల్చి, 'మీరు వాళ్లకంటే బాగా నటిస్తారు' అని అంటుంటారని విజి చెప్పారు. 'వాళ్లు కేవలం నటిస్తారు, కానీ మీరు ఆ పాత్రలో జీవిస్తారు' అని పొగుడుతారని, కానీ వాళ్లకు ఇచ్చే జీతంలో సగం కూడా తనకు ఇవ్వరని వాపోయారు. ఎండ, వాన అని తేడా లేకుండా కష్టపడి నటిస్తానని, కానీ జీతం తీసుకోవడానికి మాత్రం పోరాడాల్సి వస్తుందని అన్నారు. కొంతమంది నటులు ముందు జీతం ఇస్తేనే నటిస్తామని కరాఖండిగా చెబుతారని, కానీ తాను ఆ విషయంలో అంత కఠినంగా ఉండనని చెప్పారు. సినిమా బాగా రావాలని, తర్వాత జీతం తీసుకోవచ్చని అనుకుంటానని, కానీ సినిమా పూర్తయ్యాక 'గుడ్ బై' చెప్పి వెళ్లిపోతారని అన్నారు. 

46
రాధిక పాత్రలో విజి చంద్రశేఖర్‌
Image Credit : Instagram

రాధిక పాత్రలో విజి చంద్రశేఖర్‌

నటించి పూర్తి చేశాక, ఈరోజు జీతం ఇస్తాం, రేపు ఇస్తాం అని చెబుతుంటారు. ఎన్నో రోజులు గడిచిపోయాయి, కానీ నాకు ఇంకా జీతం రాలేదు. జీతం ఇస్తేనే నటిస్తానని చెప్పడానికి నాకు మనసు రాదు. నేను ఒక సీరియల్‌లో నటించి ఎనిమిదేళ్లు దాటింది. ఇప్పటికీ జీతం రాలేదు. ఒక ప్రముఖ టీవీ సీరియల్‌లో రాధికా శరత్‌కుమార్ నటిస్తుండేవారు. ఆ సీరియల్ సమయం మారడంతో రాధికకు నటించడం కుదరలేదు. అందుకే ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఆమె పాత్రలో నన్ను నటించమని అడిగారు. నేను మొదట వద్దన్నాను. కానీ నాకోసం ఇందులో నటించాలని రాధిక కోరారు.
56
సీరియల్‌ని మధ్యలోనే ఆపేశారు
Image Credit : Instagram

సీరియల్‌ని మధ్యలోనే ఆపేశారు

రాధిక నాకు అక్క లాంటిది. ఆమె చెప్పడంతో ఆ సీరియల్‌లో రాత్రింబవళ్లు కష్టపడి నటించాను. కానీ ఆ సీరియల్‌ను మధ్యలోనే ఆపేశారు. ఆ సీరియల్ ఆగిపోతోందన్న విషయం నాకు తెలీదు. నాతో పాటు నటించిన చాలామంది, 'ఈరోజే చివరి రోజు షూటింగ్' అని నాకు చెప్పారు. కానీ నేను నమ్మలేదు. నేను లీడ్ రోల్‌లో నటిస్తున్నాను, నాకు తెలియకుండా అలా ఆపరు అని చెప్పి, నా తోటి నటులను కూడా షూటింగ్‌కు తీసుకెళ్లాను. కానీ నాకే తెలియకుండా సీరియల్‌ను ఆపేశారు. షూటింగ్ ముగిసే ముందు సాయంత్రం 6 గంటలకు వచ్చి, ఇదే చివరి షూటింగ్ అని చెప్పారు. నాకు చాలా బాధ కలిగింది. నేను నచ్చజెప్పి తీసుకొచ్చిన తోటి నటుల ముఖం ఎలా చూడాలి? నేనొక్కదాన్నే జీతం తీసుకున్నానని వాళ్లు అనుకుని ఉంటారు.
66
18 లక్షలు మోసపోయాను
Image Credit : Asianet News

18 లక్షలు మోసపోయాను

కానీ నాకు జీతం ఇవ్వలేదు. 18 లక్షల రూపాయలు బకాయి ఉన్నారు. ఇది చిన్న మొత్తం కాదు. నేను చాలాసార్లు ఆ సంస్థకు ఫోన్ చేసి అడిగాను. కానీ ఇప్పటికీ డబ్బు రాలేదు. సినీ పరిశ్రమ నిజాయితీగా ఉండదు. చాలామంది మంచివాళ్లు ఉన్నారు. కానీ కొందరి వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. కర్మ అనేది ఒకటి ఉందని నేను నమ్ముతాను. అందుకే వాళ్లను కర్మ చూసుకుంటుందని వదిలేశాను. నా నుదుటి మీద 'అమాయకురాలు అని రాసి ఉందేమో, అందుకే నన్ను చాలామంది మోసం చేస్తున్నారు. కానీ ఇకపై నేను కఠినంగా ఉంటాను అని ఆమె నవ్వుతూ చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(104.4 ov) 99 & 290/8
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు, అది రజనీకి మాత్రమే సాధ్యం.. జైలర్ 2పై అల్లు అర్జున్ రివ్యూ
Recommended image2
Sanjay Leela Bhansali: సంజయ్ లీలా భన్సాలీ సినిమాటిక్ యూనివర్స్.. తప్పకుండా చూడాల్సిన 6 ఐకానిక్ సినిమాలు
Recommended image3
Ram Charan: భారీ ఫ్లాపుల తర్వాత రాంచరణ్ తో సినిమా..వాడేం విన్నాడో తెలియదు, కథ వినకుండానే ఒట్టేసిన చిరు
Related Stories
Recommended image1
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Recommended image2
Roja: నాగార్జునతో ఇబ్బంది, బాలయ్యతో చేయను, చిరంజీవితో రొమాన్స్ కి సై.. రోజా సంచలన స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved