MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభన్ బాబుని అలా చూడగానే కన్నీళ్లు వచ్చాయి..చిరు, బాలయ్య కంటే ఎక్కువగా..సీనియర్ హీరోయిన్ కామెంట్స్

శోభన్ బాబుని అలా చూడగానే కన్నీళ్లు వచ్చాయి..చిరు, బాలయ్య కంటే ఎక్కువగా..సీనియర్ హీరోయిన్ కామెంట్స్

శోభన్ బాబుతో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. సుహాసిని తాజాగా ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2024, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు టాలీవుడ్ లో అందగాడు అంటే శోభన్ బాబు పేరే చెబుతారు. తన నటన, క్రమశిక్షణ, అందంతో శోభన్ బాబు చరిత్రలో నిలిచిపోయారు. మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా పొందిన నటుడు ఆయన. హీరోయిన్లలో కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Sobhan Babu

Sobhan Babu

శోభన్ బాబుతో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్లలో సుహాసిని ఒకరు. సుహాసిని తాజాగా ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుహాసిని మాట్లాడుతూ నేను నాగార్జున, వెంకటేష్ ఇద్దరితో ఒక్కో చిత్రం మాత్రమే చేశాను. చిరంజీవి, బాలకృష్ణతో అయితే చాలా సినిమాలు చేశాను. అందరికంటే నేను ఎక్కువగా నటించింది శోభన్ బాబు గారితోనే అని సుహాసిని తెలిపింది. 

35
Sobhan Babu

Sobhan Babu

మా ఇద్దరిదీ హిట్ పెయిర్. మొట్టమొదట శోభన్ బాబుతో నటించిన చిత్రం బావ మరదళ్ళు అని సుహాసిని తెలిపింది. ఇటీవల ఎవరో శోభన్ బాబు గారి ఫోటోని ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఫారెన్ లో శోభన్ బాబు గారు యంగ్ లుక్ లో ఉన్నారు. ఆయన లుక్ ని చాలా మోడ్రన్ గా క్రియేట్ చేశారు. 

45

ఆ ఫోటో చూడగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆయన ఈ టైంలో ఉండి ఉంటే అంతే స్టైలిష్ గా.. అంతే అందంగా ఉంటారు. శోభన్ బాబు గారిని చాలా మిస్ అవుతున్నాం అని సుహాసిని ఎమోషనల్ అయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి కంటే ఆయన తో నాకు ఎక్కువ బాండింగ్ ఉంది అని సుహాసిని పేర్కొంది. 

55
Suhasini

Suhasini

షూటింగ్ కి శోభన్ బాబు గారు కాస్త లేటుగా వస్తారు. ఆ విషయాన్ని ముందే చెబుతారు. నేను 40 నిమిషాలు లేటుగా వస్తా. నువ్వు కంగారు పడిపోయి వెంటనే వచ్చేయకు. కాస్త రిలాక్స్ అవ్వు అని చెప్పువారు. మతపరమైన విషయాలు చాలా చర్చించేవారు అని సుహాసిని పేర్కొంది. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved