ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ చించేసిన టాలీవుడ్ నటి..రాంగ్ రూట్ లో వచ్చి రచ్చ రచ్చ
అప్పుడప్పుడూ టాలీవుడ్ నటీనటులు ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతుంటారు. ఫైన్ కట్టి తప్పించుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే తప్పు చేసి కూడా ట్రాఫిక్ పోలీసులతో గొడవకి దిగడం చాలా అరుదు.

అప్పుడప్పుడూ టాలీవుడ్ నటీనటులు ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతుంటారు. ఫైన్ కట్టి తప్పించుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే తప్పు చేసి కూడా ట్రాఫిక్ పోలీసులతో గొడవకి దిగడం చాలా అరుదు. మద్యం మత్తులో ఉంటే తప్ప అలా చేయరు. తాజాగా టాలీవుడ్ యువ నటి సౌమ్య జాను హైదరాబాద్ లో నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన సంఘటన వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది.
సౌమ్య జాను టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ రాణిస్తోంది. ఆమె తడాకా, చందమామ కథలు, లయన్ లాంటి చిత్రాల్లో నటించింది. సౌమ్య జాను రీసెంట్ గా తన జాగ్వార్ కారులో ప్రయాణిస్తూ రాంగ్ రూట్ లో వెళ్ళింది. దీనితో ట్రాఫిక్ హోమ్ గార్డు అడ్డుకున్నారు. వివరణ ఇచ్చుకోవడమో, ఫైన్ కట్టడమో చేయాలి. కానీ సౌమ్య జాను తప్పు చేసింది కాక ట్రాఫిక్ హోమ్ గార్డుతో నడిరోడ్డుపై రచ్చ చేసింది.
ఏకంగా అతడి యూనిఫామ్ చించేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ హోమ్ గార్డుని నానా మాటలు అడుగుతూ పెద్ద హంగామానే చేసింది ఈ నటి. అయితే వీడియో ద్వారా ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తప్పుని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సెంటిమెంట్ ని పైకి తీసుకువచ్చింది. తన తల్లి మెడిసిన్స్ కోసమే రాంగ్ రూట్ లో వెళ్లినట్లు సౌమ్య జాను పేర్కొంది.
అత్యవసర సమయంలో రాంగ్ రూట్ లో వెళ్ళా ఇది పెద్ద నేరమా ? ఆ ట్రాఫిక్ హోమ్ గార్డు నన్ను నానా మాటలు అడిగాడు. ముం* అని తిట్టాడు. కాబట్టే నేను కూడా తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది అని సౌమ్య జాను చెబుతోంది. నేను మద్యం సేవించానని అందరూ అంటున్నారు. తనకి ఆ అలవాటు లేదని కావాలంటే పరీక్షలకు సిద్ధం అని సౌమ్య జాను పేర్కొంది.
ఈ సంఘటన వీడియో రూపంలో వైరల్ అవుతుందని అనుకోలేదు. అయినా తనలాంటి వాళ్లే అత్యవసర సమయాల్లో రాంగ్ రూట్ లో వెళ్లలేకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ సౌమ్య కామెడీగా ఒక లాజిక్ బయటకి తీసింది. నెటిజన్లు ఇదేం లాజిక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ వివాదంలో తనపై కేసు పెడితే తాను కూడా హోమ్ గార్డుపై తిరిగి కేసు పెడతా అని అంటోంది. హోమ్ గార్డు తనని బూతులు తిట్టాడని, సాక్ష్యాలు ఉన్నాయంటోంది. అయితే ఇంతవరకు పోలీసులు విచారణకి పిలవలేదని సౌమ్య అంటోంది.