- Home
- Entertainment
- బీచ్ లో అలా కనిపించి షాక్ ఇచ్చిన సురేఖా వాణి ... తప్పు చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోండంటున్న జనాలు!
బీచ్ లో అలా కనిపించి షాక్ ఇచ్చిన సురేఖా వాణి ... తప్పు చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోండంటున్న జనాలు!
నటి సురేఖా వాణి సోషల్ మీడియా పోస్ట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె లేటెస్ట్ వెకేషన్ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి.

Surekha Vani
యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా మారిన వారిలో సురేఖా వాణి ఒకరు. ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతున్నారు. యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా గ్లామర్ ఒలకబోతున్నారు. పొట్టిబట్టల్లో టెంపరేచర్ పెంచేస్తున్నారు. సురేఖా వాణి లేటెస్ట్ ఫోటోలు నెటిజెన్స్ కి కునుకు లేకుండా చేస్తున్నాయి. బాగా డిస్టర్బ్ అవుతూ దారుణ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Surekha Vani
తాజాగా సురేఖా వాణి బీచ్ వెకేషన్ కి వెళ్లారు. సాగర తీరంలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన సురేఖా వాణి... సాయంత్రం వేళ తీరాన కూర్చొని జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సురేఖా వాణి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
సురేఖా వాణి గ్లామర్ కి నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మీరు ఇంత అందంగా ఉండటం తప్పు. మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ ఆనందం వేస్ట్ చేసుకోవద్దు, అని కామెంట్ పెట్టాడు. వయసు, మనసు ఉన్నప్పుడు అడవి కాచిన వెన్నెల చేసుకోకండని అతగాడు సురేఖా వాణికి సలహా ఇచ్చాడు. అతడి సూచన సురేఖా వాణి ఏ మేరకు పాటిస్తుందో చూడాలి.
కాగా సురేఖా వాణి పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అమ్మాయి పేరు సుప్రీత. ఆమె సోషల్ మీడియాలో ఫేమస్. సురేఖా వాణి భర్త సురేష్ తేజ 2019లో అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆమె రెండో వివాహం చేసుకుంటున్నారంటూ తరచుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆ ఆలోచన లేదని సురేఖా వాణి గట్టిగా చెప్పారు.
మరోవైపు కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకుండానే సుప్రీత అభిమానులను మైంటైన్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా సుప్రీత తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. కాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహను సుప్రీత ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక సురేఖా వాణి జోరు తగ్గింది. గతంలో మాదిరి ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. ఆ మధ్య ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో సురేఖా వాణి తన అసహనం బయటపెట్టారు. పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఆఫర్స్ ఇవ్వడం లేదని ఓపెన్ అయ్యారు.ప్రస్తుతం సురేఖా వాణి సోహైల్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో నటిస్తున్నారు.