- Home
- Entertainment
- Priyamani: గ్లామర్ తో కుర్రాళ్ళని అరెస్ట్ చేస్తున్న ప్రియమణి.. ఇంత అందం నుంచి తప్పించుకోగలరా
Priyamani: గ్లామర్ తో కుర్రాళ్ళని అరెస్ట్ చేస్తున్న ప్రియమణి.. ఇంత అందం నుంచి తప్పించుకోగలరా
ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

ప్రియమణి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటన, అభినయం, అందం విషయంలో ప్రియమణికి వంకలు పెట్టలేం. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.
కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో Priyamani ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
Priyamani ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి Dhee Jodi షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది.
ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. 37 ఏళ్ల వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది.
తాజాగా ప్రియమణి 'ఢీ 14 డాన్సింగ్ ఐకాన్' షో కోసం ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు జిగేల్ మనే అవుట్ ఫిట్ లో ప్రియమణి గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. విభిన్నమైన ఫోజుల్లో ప్రియమణి అందాల హొయలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
ప్రియమణికి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ వస్తున్నాయి. Family man 2లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్యగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన Narappa చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ప్రియమణి పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం ప్రియమణి విరాట పర్వం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ విషయంలో ప్రియమణి కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. 37 ఏళ్ల వయసులో కూడా ప్రియమణి ట్రెండీ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తోంది. రీసెంట్ గా ప్రియమణి భామాకలాపం అనే వెబ్ సిరీస్ లో నటించింది.