వడివేలు వేధింపులపై బాంబు పేల్చిన నటి.. నాకు తెలుసు అంటూ షకీలా కూడా, తీవ్ర దుమారం
కోలీవుడ్ లో వడివేలు తిరుగులేని కమిడియన్ గా ఎదిగారు. కానీ పలు వివాదాల కారణంగా చాలా రోజులు ఆయన వెండితెరకి దూరం అయ్యారు.

ఇటీవల ఎక్కువగా చిత్ర పరిశ్రమలో నటీమణుల వేధింపులకు సంబందించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు, అసిస్టెంట్ డైరెక్టర్స్, నటులు ఇలా నటీమణులని వేధిస్తున్నారు అంటూ పలు వార్తలు చూశాం. వైరముత్తు లాంటి సీనియర్లు కూడా అందుకు అతీతం కాదు అన్నట్లుగా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు.
చాలా కాలం నుంచి చిన్మయి వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రముఖ కోలీవుడ్ నటుడు నటీమణుల వేధింపుల వ్యవహారంలో చిక్కుకున్నారు. కోలీవుడ్ లో వడివేలు తిరుగులేని కమిడియన్ గా ఎదిగారు. కానీ పలు వివాదాల కారణంగా చాలా రోజులు ఆయన వెండితెరకి దూరం అయ్యారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తో కూడా వడివేలుకి వివాదాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్ చిత్రంతో వడివేలు సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో తండ్రిగా, ఎమ్మెల్యేగా వడివేలు నటన అద్భుతం అనే చెప్పాలి. కామెడీ పండించే వడివేలు ఈ చిత్రంలో ఎమోషనల్ గా నటించి అదరగొట్టారు. అయితే ఓ కోలీవుడ్ నటి తాజా ఇంటర్వ్యూలో వడివేలు వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు పొందిన షకీలా ఇప్పుడు వెండి తెరకు కాస్త దూరం అయింది. కోలీవుడ్ లో బుల్లితెరపై షోలు చేస్తోంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ లో సెలెబ్రిటీలతో టాక్ షో కూడా నిర్వహిస్తోంది. ఈ షోలో ఆమె సెలెబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ పలు కాంట్రవర్సీ అంశాలని ప్రస్తావిస్తూ ఉంటుంది. తాజాగా షకీలా ఇంటర్వ్యూలో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రేమ ప్రియా పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో ప్రేమ ప్రియా.. వడివేలు గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేను కెరీర్ ఆరంభంలో వివేక్, వడివేలు, సంతానం లాంటి కమెడియన్లతో కలసి చిన్న చిన్న పాత్రలు చేశాను. ఆఫర్స్ బాగా వచ్చేవి. కానీ వడివేలు నా ఎదుగుదలని అడ్డుకున్నారు. హమ్మయ్య మంచి అవకావం వచ్చింది అని షూటింగ్ కి వెళితే అక్కడ వడివేలు నన్ను చూసి.. ఈ అమ్మాయి వద్దు పంపించి వేయండి అంటూ నిర్మాతలకు చెప్పేవారు. అలా చాలా అవకాశాలు కోల్పోయా అని ప్రేమ ప్రియా పేర్కొంది.
వడివేలు గురించి బయట నెగిటివ్ గా చెబితే నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. నాకు అవకాశాలు రాకుండా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు కాదు. అసలు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు అని ప్రేమ ప్రియా వడివేలు గురించి సంచలన వ్యాఖ్యలకి చేసింది. వడివేలుపై మీటు ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించగా లేదు అని ప్రేమ ప్రియా బదులిచ్చింది. ఆయన ఏం కోరుతున్నారో అర్థం కాలేదు అని తెలిపింది. దీనితో షకీలా స్పందిస్తూ వడివేలు గురించి నాకు బాగా తెలుసు. షూటింగ్ స్పాట్ లో ఏం చేస్తారు.. ఏం కోరుకుంటారో కూడా నాకు తెలుసు అంటూ పరోక్షంగా బాంబు పేల్చింది.