MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలంగాణలో జరగబోయే దారుణాలు ఇవే.. కాంగ్రెస్ లవర్స్ ఎంజాయ్ చేయండి, మాధవీలత తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణలో జరగబోయే దారుణాలు ఇవే.. కాంగ్రెస్ లవర్స్ ఎంజాయ్ చేయండి, మాధవీలత తీవ్ర వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం మాధవీలతకి అంతగా నచ్చినట్లు లేదు. కాంగ్రెస్ గెలుపుపై ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారేలా ఉంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2023, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి మాధవీలత గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో మాధవీలత స్నేహితుడా, నచ్చావులే లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మాధవీలత టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటి సంఘటనలపై నోరు విప్పి సంచలనం సృష్టించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా మాధవీలత వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియాలో మాధవీలత తన అభిప్రాయాలని బోల్డ్ గా చెబుతూనే ఉంది. సినిమా విషయాలు మాత్రమే కాదు రాజకీయాలపై కూడా మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 

36

అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం మాధవీలతకి అంతగా నచ్చినట్లు లేదు. 

46

కాంగ్రెస్ గెలుపుపై ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణలో రావణ రాజ్యం రాబోతోందని మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

56

మాధవీలత పోస్ట్ చేస్తూ.. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే.. ఫుడ్ ఉండదు.. ఉద్యోగాలు ఉండవు.. మహిళలకు భద్రత ఉండదు.. శాంతి అసలే ఉండదు. ఎంజాయ్ చేయండి.. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ కి గుడ్ లక్.. ఇక రావణ సామ్రాజ్యం మొదలు. కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ కి నా మార్కులు 99 అంటూ మాధవీలత పోస్ట్ చేసింది. 

 

66

దీనితో కాంగ్రెస్ మద్దతుదారులు మాధవీలతని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలనే కనీస జ్ఞానం లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. బయట ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ముందు తెలుసుకో అంటూ బదులిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved